గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?

Do u know who is nayeem

మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ న‌యీం ఆలియాస్ న‌యీముద్దీన్ హ‌త‌మ‌య్యాడు. నిన్న సాయంత్రం షాద్ న‌గ‌ర్ చేరుకున్న న‌యీం ముఠాను పోలీసులు గుర్తించారు. గ్రే హౌండ్స్ పోలీసులు చుట్టుప‌క్క‌ల ఉన్న ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించి అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా న‌యీం గ‌న్ మెన్ కాల్పులు జ‌రిపాడు. ఈ నేప‌థ్యంలో పోలీసుల ఎదురుకాల్పుల‌లో న‌యీం హ‌త‌మ‌య్యాడు.

భువ‌న‌గిరికి చెందిన న‌యీం ఐపీఎస్ అధికారి, డిఐజీ వ్యాస్ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు. ఆ త‌రువాత భువ‌న‌గిరిలో బెల్లి ల‌లిత‌ను 16 ముక్క‌లుగా న‌రికి ఆమె స‌న్నిహితుల‌కు పార్సిల్ చేసి 16 ఏళ్ల క్రితం సంచ‌ల‌నం సృష్టించాడు. మావోయిస్టు నేత‌ల‌తో విభేధాలు వ‌చ్చిన నేప‌థ్యంలో వారికి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ మావోల‌కు స‌హ‌కారం అందించేవారిని మ‌ట్టుబెట్ట‌డం మొద‌లు పెట్టాడు.

న‌క్స‌లైట్ నుండి వారికి వ్య‌తిరేకంగా నక్స‌ల్స్ అగ్ర‌నేత‌లు ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి, శాఖ‌మూరి అప్పారావుల‌కు స‌న్నిహితుడు అయిన న‌యీం ఆ త‌రువాత న‌క్సల్స్ ను అంతం చేయ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని ప్ర‌క‌టించాడు. కోవ‌ర్టుగా పోలీసు అధికారుల‌కు స‌న్నిహితం అయిన న‌యీం మావోల ర‌హ‌స్యాల‌ను పోలీసుల‌కు చేర‌వేశాడు. కేఎస్ వ్యాస్ తో పాటు బెల్లి ల‌లిత‌, పౌర‌హ‌క్కుల నేత‌లు అజం అలీ, క‌రుణాక‌ర్, పురుషోత్తం, మాజీ మావోయిస్టులు గ‌ణేష్, ఈద‌న్న‌, మాజీ మావోయిస్టు కార్య‌ద‌ర్శి, టీఆర్ఎస్ నేత సాంబ‌శివుడు, ఆయ‌న త‌మ్ముడు కోన‌పురి రాములు, ప‌టోళ్ల గోవ‌ర్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌ను హ‌త‌మార్చిన కేసుల్లో నిందితుడు. వంద‌ల సెటిల్మెంట్ ల‌లో న‌యీం హ‌స్తం ఉంది. హ‌త‌మార్చిన 48 గంట‌ల‌లో ఎవ‌రో ఒక‌రిని దానికి బాధ్యులుగా పోలీసుల వ‌ద్ద‌కు పంప‌డం నయీం చేస్తుండేవాడు. తెర‌వెన‌క చ‌క్రం తిప్పుతూ అనేక మందిని భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసిన న‌యీం షాద్ న‌గ‌ర్ లో హ‌త‌మ‌వ‌డం జ‌రిగింది.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
పెట్రోల్ లీటర్‌కు 250
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
స్థూపం కావాలి
ముద్రగడ సవాల్
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ప్యాకేజీ కాదు క్యాబేజీ
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
బినామీలు భయపడే మోదీ ప్లాన్
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
ట్రంప్ సంచలన నిర్ణయం
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
మోదీ మీద మర్డర్ కేసు!
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments