నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?

Do you know about BHIM app

డిజిటల్‌ చెల్లింపుల కోసం మోదీ సర్కార్ కొత్తగా ‘భీం’ పేరుతో కొత్త ఈ వాలెట్‌ యాప్‌ను అభివృద్ధి రూపొందించింది. ఇప్పటి వ‌ర‌కు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే దీని వాడ‌కం చాలా సులభం. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫీచ‌ర్ ఫోన్ల వ‌ర‌కు అన్నింటిలోనూ దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్‌ వినియోగానికి ఇంటర్నెట్‌ కూడా అవసరం లేదంటున్నారు. కానీ యాండ్రాయిడ్‌ వర్షన్‌కి మాత్రం నెట్‌ తప్పనిరిగా ఉండాల్సిందే. నెట్‌ అవసరం లేకుండా కేవలం యూఎస్ఎస్‌డీ(మెసేజ్‌) ద్వారా ప‌నిచేసే యాప్‌ను త్వర‌లో విడుద‌ల చేయ‌నున్నట్టు తెలుస్తోంది.

భీం ను ఇన్‌స్టాల్ చేసుకునే విధానం:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లాలి. భీం (బీహెచ్‌ఐఎం) పేరుతో ఉన్న యాప్‌ను మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. తర్వాత ఇన్ స్టాల్ అయిన యాప్ ను ఓపెన్ చేసి మనకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. మనం బ్యాంక్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ తో యాప్‌లో వెరిఫైడ్ చేసుకోవాలి. వెరిఫై అయిన తర్వాత సెల్ కు మెసేజ్ వస్తుంది. ఇందుకు ఒక ఎస్‌ఎంఎస్‌ ఛార్జీ పడుతుంది. దీనికి ఛార్జీ కూడా పడుతుంది. డ్యూయల్‌ సిమ్‌ మొబైల్‌ అయితే బ్యాంకులో ఇచ్చిన నంబరును ఎంపిక చేసుకోవాలి. ఆ త‌ర్వాత సీక్రెట్  పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి. త‌ర్వాత మ‌న బ్యాంకును ఎంచుకుని కొనసాగించటమే..

లావాదేవీలు జరిపే విధానం:
భీం యాప్ లో స్కాన్ అండ్ పే ఆఫ్షన్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు క్యూ ఆర్ కోడ్ వస్తుంది దానిని అవతలి వ్యక్తికి పంపాలి. అలా పంపిన కోడ్ ను వారు స్కాన్ చేసి డబ్బులు చెల్లించుకోవచ్చు. ఇదే విధంగా మనం కూడా నగదు చెల్లించవచ్చు. అయితే ఈ లావాదేవీలన్నీ మనం మొదట నమోదు చేసుకున్న బ్యాంకు నుంచే జరుగుతాయి. దీంతో మనం ఇతర వాలెట్లలా ముందుగా డబ్బులు జమ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అదేవిధంగా భీంలో న‌మోదు కాని, యూపీఐ లేని ఖాతాదారుల‌కు కూడా ఈ యాప్ సాయంతో డ‌బ్బులు పంపించుకోవచ్చు. ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, అకౌంట్ నంబ‌రు, ఎంఎంఐటీ, మొబైల్ నంబ‌ర్లను ఉప‌యోగించి లావాదేవీలను జరుపుకోవచ్చు. ఈ యాప్ నుంచి డ‌బ్బులు పంపించాలంటే తొలుత యూపీఐ పిన్‌ను క్రియేట్ చేసుకోవాలి.  పిన్ ను ఎంపిక చేసుకున్నాకా.. తర్వాత బటన్‌ ప్రెస్ చేయాలి. అక్కడ మొబైల్‌, యూపీఐ వివరాలు అడుగుతుంది. అవి లేనపుడు ఐఎఫ్ఎస్సీ, అకౌంట్ నెంబర్ వివరాలతో అవతలి వ్యక్తికి డబ్బులు పంపొచ్చు. అయితే మనం రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, రోజుకు రూ.20 వేలు ఈ యాప్ ద్వారా పంపించుకోవచ్చన్నమాట. ఈ యాప్ ద్వారా మనం ఏ బ్యాంక్ ఖాతాల్లో నైనా డబ్బు పంపుకోవచ్చు. ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ కైనా లావాదేవీలు జరుపుకోచ్చు.

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
బావర్చి హోటల్ సీజ్
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
ట్రంప్ సంచలన నిర్ణయం
అవినీతి ఆరోపణల్లో రిజిజు
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
మోదీ మీద మర్డర్ కేసు!
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
డబ్బు మొత్తం నల్లధనం కాదు

Comments

comments