BSNL లాభం ఎంతో తెలుసా?

Do you know BSNL profit last economic year

భారత ప్రభుత్వరంగ సంస్థల్లో భారత్ రైల్వేస్ తర్వాత అతిపెద్ద ప్రజాదరణ ఉన్న సంస్థ BSNL.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పేరుతో కోట్లాది మందికి సురిచితం ఈ సంస్థ. కాగా స్వతంత్రం సిద్ధించిన నాటి నుండి ఈ సంస్థ నష్టాలను మూటగట్టుకుందే కానీ ఏనాడు లాభాలను మాత్రం పోగేసుకోలేదు. కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం ఒకే తీరుగా ఉండదు. తాజాగా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ మీద భిన్నవైఖరితో కొత్త పుంతలు తొక్కించింది. చివరకు నష్టాల బారి నుండి కాపాడి లాభాల వేటను మొదలుపెట్టించింది. బిఎస్ఎన్ఎల్ స్థాపించిన నాటి నుండి ఇప్పటి వరకు రాని లాభాలు ఈఒక్కసారిలో గడించడం అందరికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది.

గత ఆర్థిక సంవత్సరం అంటే 2015-16లో బీఎస్ఎన్ఎల్ నిర్వహణ లాభం ఏకంగా ఆరురెట్లైంది. సంస్థ ఎన్నడూ లేనంతగా 3855 కోట్ల లాభాన్ని గడించింది. అంతకుముందు సంవత్సరం కేవలం 672 కోట్లు మాత్రమే ఉండగా గత సంవత్సరం మాత్రం 3855 కోట్లు రావడం శుభశకునం. బీఎన్ఎన్ఎల్ కార్యకలాపాల ఆదాయం 4.4 శాతం గ్రోత్ రేట్ తో 28449 కోట్లు పెరిగింది అని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొబైల్ వ్యాపారం 25వేల కొత్త టవర్లు వేయడంతో వ్యాపారం మరింత విస్తరించింది. ఇక ఎంటర్ ప్రైజెస్ విభాగం 28 శాతం, ఫిక్స్ డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ కూడిన ల్యాండ్ లైన్ విభాగం 2శాతం, మొబైల్ 8శాతం చొప్పున వృద్ధి సాధించాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Related posts:
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సింగ్ ఈజ్ కింగ్
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
వీళ్లకు ఏమైంది..?
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
పోరాటం అహంకారం మీదే
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
వాళ్లను వదిలేదిలేదు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
అమ్మకు ఏమైంది?
ప్యాకేజీ కాదు క్యాబేజీ
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
వాళ్లకు ఇదే చివరి అవకాశం
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Comments

comments