ఓటుకు నోటు కేసును మూసేశారా?

Do you think Chandrababu naidu escape from Cash for Vote case

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు మూత ప‌డ్డ‌ట్లేనా..? ఏపీ సీఎం చంద్ర‌బాబు సేఫ్‌గా బ‌య‌ట ప‌డ్డ‌ట్లేనా..? చూస్తుంటే అలాగే క‌నిపిస్తుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని ఎసిబి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తన పాత్రపై విచారణ చేయాలన్న ఎసిబి కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు జడ్జి ఆ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ కేసులో చంద్రబాబుపై విచారణ అవసరం లేదన్న ఆయన పక్ష లాయర్ వాదనతో ఏకీభవించింది.

అంతేకాదు.. మంగళగిరి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి బాధితులు కాని, ఫిర్యాదుదారులుకాని వాదనలు వినిపించాలని, మీకేమి సంబంధం అని రామకృష్ణారెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు.మాజీ ఎమ్.పి ఉండవల్లి అరుణ కుమార్ వాదనలను కూడా కేసు తోసిపుచ్చింది. ఇలా కేసుకు సంబంధించిన అన్ని పిటీష‌న్ల‌ను తోసిపుచ్చింది. అయితే దీనిపై అప్పీల్‌కు వెళ్లితే చూడొచ్చెమో కానీ.. ఇప్ప‌టికిప్పుడు బాబుకు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. హైకోర్టు నిర్ణ‌యంతో చంద్ర‌బాబు మాత్రం కాస్త ఒడ్డుకు చేరిన‌ట్లే..? అయితే ప్ర‌ధాన నిందితుడుగా ఉన్న చంద్ర‌బాబే ఎస్కేప్ అయితే కేసు కూడా నీరుగారినట్లే..? లేక‌పోతే ఈ కేసులు మ‌త్త‌య్య‌, సెబాస్టియ‌న్‌, రేవంత్ ల చుట్టే తిరుగుతుంది.

అయితే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన మీద వేస్తున్న కేసులకు స్టేలు తెచ్చుకొని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే స్టేలు తెచ్చుకోవడంలో రికార్డుకు దగ్గరలో ఉన్న చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో ఆ రికార్డును బ్రేక్ చేస్తున్నారు అని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. వైయస్ జగన్ వర్గంతో ఇప్పటికే నానాఇబ్బందులు పెడుతుండగా.. ప్రస్తుతానికి అయితే తెడ్డు సహాయంతో ఎలాగోలా అధికారంలో ఈదుతున్నా ఏదో ఒకరోజు బాబుగారి నావ మునిగిపోక తప్పదు అని చాలా మంది భావన. అయితే ఓటుకు నోటు కేసు మూతబడటం అనేది జరగదని తెలుస్తోంది.. కేవలం ప్రస్తుతానికి కోర్టులో వేసిన ఈ పిటిషన్ ను మాత్రమే కోర్టు కొట్టివేసింది తప్పితే మొత్తానికి కేసును మాత్రం కొట్టివెయ్యలేదు అని గమనించాలి.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న

Comments

comments