డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)

Doctor-Chandrababu

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. రాయలసీమ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఆయన గళమెత్తారు. కడప కలెక్టరేట్ లో ధర్నా నిర్వహించిన జగన్ మరోసారి చంద్రబాబు నాయుడును, ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఏకిపారేశారు. కరువు మీద మేనేజ్ మెంట్ టీంను రంగంలోకి దింపి రెయిన్ గన్స్ ను తీసుకువచ్చారని విమర్శించారు. రెయిన్ గన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావని.. ఎంతో కాలం కిందటే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు రైతులను పచ్చిగా మోసం చేస్తున్నాడు అని జగన్ దుయ్యబట్టారు.

ఏపిలో కరువు, వర్షం వివరాలు కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని జగన్ విమర్శించారు. స్విస్ ఛాలెంజ్ కోసం కేబినెట్ మీటింగ్ ను పెట్టగలిగిన చంద్రబాబు కరువు మీద మాత్రం కేబినెట్ సమావేశాన్ని నిర్వహించలేకపోయారు అని అన్నారు.  ఖరీఫ్‌లో రైతులను ఆదుకునేందుకు, వారికి రుణాలు ఏమేరకు అందాయో తెలుసుకునేందుకు ఆగస్టు 12లోపు సమావేశం నిర్వహించాల్సి ఉండగా దానిని సీఎం చంద్రబాబు సెప్టెంబర్‌ 15కు వాయిదా వేశారు. పోనీ  సెప్టెంబర్‌ 15న ఈ మీటింగ్‌ వల్ల రైతులకు మేలు జరుగుతుందా? అని చంద్రబాబును నిలదీశారు. రైతులమీద చంద్రబాబుకు ప్రేమ నిజంగా ఉందా? అని ప్రశ్నించారు.

ఎక్కడైనా వర్షాలు తీవ్రంగా వస్తే ఏరియల్ సర్వే నిర్వహిస్తారు కానీ కరువు వచ్చినా కానీ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఏరియల్ సర్వే నిర్వహించిన మొదటి సిఎంగా చంద్రబాబు నాయుడునే చూస్తున్నానని జగన్ అన్నారు. కరువు రాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడం ద్వారా రైతులను రక్షించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శ్రీశైలం నీళ్లు నిండుగా ఉన్నా వాటిని ఎడాపెడా తోడేస్తున్నారని.. దాని వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. ఇలా చేస్తున్న సిఎం చంద్రబాబు నాయుడును పిచ్చాసుపత్రిలో చేర్చాలా..? బంగాళాఖాతంలో వెయ్యాలా అని ప్రజలను ప్రశ్నించారు. రైతులను మోసం చెయ్యడంలో బాబుగారు పిహెచ్‌డి తీసుకున్నారని అన్నారు జగన్.

Related posts:
భర్తను వదిలి ప్రియుడితో ప్రేమ.. ఇది 2016 లవ్‌స్టోరీ
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
‘స్టే’ కావాలి..?
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
వాళ్లను వదిలేదిలేదు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
పోస్టాఫీస్‌లపై సీబీఐ దాడులు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్

Comments

comments