ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర

Dog traveled six hundred kilometers to Shabarimala

విశ్వాసంలో ముందు నుండి మనిషికి కుక్క చాలా దగ్గరైంది. అందుకే మనుషులను నమ్ముకునే కన్నా కుక్కని నమ్ముకోవడం చాలా ఉత్తమం అని పెద్దలు అంటుంటారు. అయితే తాజాగా ఓ కుక్క వార్తల్లోకెక్కింది. ఏదో విశ్వాసం చూపించి ఉంటుంది కాబట్టి వార్తల్లో వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నారేమో కానీ మామూలు విశ్వాసం కాదు ఆరు వందల కిలోమీటర్లు నడిచిన విశ్వాసం. అదేంటి ఆరు వందల కిలోమీటర్లు నడిచిన విశ్వాసం ఏంటి అనుకుంటున్నారా? అయితే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

కేరళలోని కోజీకోడ్ కు చెందిన నవీన్ అయ్యప్ప మాలను ధరించి ఇరుముడి ఎత్తుకొని శబరిమలకు కాలినడకన పయనమయ్యాడు. మొదటిరోజు నడక ఒంటరిగా సాగింది.. కాగా సెకండ్ రోజున నవీన్ స్వామిని ఓ కుక్క అనుసరించడం మొదలు పెట్టింది… నవీన్ స్వామి ఆ కుక్కను ఎంత తరిమివేయాలని ప్రయత్నించినా నవీన్ ని వదలక అతని వెంటనే నడవడం మొదలు పెట్టింది.. దీంతో నవీన్ కుక్కను తరిమివేయ్యాలి అనే ఆలోచన విరమించుకొని తన వెంట రానిచ్చాడు… అలా తనతో పాటు వందల కిలోమీటర్లు వస్తున్న కుక్కకు “మాలు” అనే పేరు కూడా పెట్టాడు… మాలు నవీన్ స్వామి వస్తువులను కాపలాకాయడం… సెల్ ఫోన్ వర్క్ చేయని సమయంలో తెల్లవారు ఝామున నిద్ర లేపడం వంటి పనులు చేసింది… కాగా నవీన్ శబరిమల చేరుకొనే సమయానికి మాలు తప్పిపోయింది.

దీంతో నవీన్ తన నేస్తం కోసం చాలా వెదికాడు. తోటి స్వాముల ను తన ఫ్రెండ్ మాలు కోసం విచారిస్తున్న సమయంలో కొందరు స్వాములు రెండు రోజులుగా దేవాలయం వద్దకు వెళ్ళే మెట్ల దారి వద్ద ఓ కుక్క ఎవరికోసమో వెదుకుతూ.. అందరి స్వాములను వాసన చూస్తుందని చెప్పారు… దీంతో నవీన్ వెంటనే మాలు వద్దకు వెళ్ళగా… మాలు నవీన్ ని గుర్తిపట్టి… ఎంతో ప్రేమగా నవీన్ ని చుట్టేసింది… నవీన్ దర్శనం అనంతరం మాలుని తన ఇంటికి తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకొంటున్నాడు.. కాగా ఈరోజుల్లో మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక బంధాలుగానే మారిపోయాయి అని అనుకొనే సమయంలో ఓ కుక్క మనిషి పట్ల ఇంతటి ప్రేమ.. విశ్వాసం కనబరచడం విశేషం గా చెప్పుకొంటున్నారు.. అందునా నవీన్ తో పాటు మాలు సుమారు 600.కిమీ నడవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Related posts:
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
సింగ్ ఈజ్ కింగ్
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
ఓడినా విజేతనే.. భారత సింధూరం
‘స్టే’ కావాలి..?
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
బాబు గారి అతి తెలివి
మంత్రుల ఫోన్లు బంద్
తిరిగబడితే తారుమారే
పాత ఐదు వందల నోట్లు ఇక్కడ చెల్లుతాయి
మోదీ ఒక్కడే తెలివైనోడా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
ఒక్క రూపాయికే చీర
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్

Comments

comments