కుక్కలు ఎంత పనిచేశాయి

Dogs stopped a flight

మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అంటూ తెలుగు సినిమాలో ఓ డైలాగ్ ఉంది. అలాగే వీధికుక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే ఏకంగా విమానాన్నే ఆపించేశాయి. ఔరంగబాద్‌లో జరిగిన ఈ ఘటన అందరికి ఆశ్చర్యాన్ని, ప్యాసింజర్లకు కాస్త ఆలస్యాన్ని కలిగించాయి. ఢిల్లీ నుంచి వయా ఔరంగాబాద్ మీదుగా, ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి కుక్కల వల్ల అంతరాయం కలిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఔరంగాబాద్ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి 7.10కి ల్యాండ్ అయింది. మళ్లీ ఆ విమానం 8.40కి ముంబై బయలుదేరి వెళ్లిపోవాలి.

ప్రయాణికులంతా 8.10 కల్లా ఎక్కేశారు. పైలెట్లు ప్రయాణం మొదలుపెట్టడానికి ముందు చేసే ప్రొసీజర్స్ లో ఉన్నారు. ఈలోగా మూడు వీధికుక్కలు రన్ వే పై దర్శనమిచ్చాయి. వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది రంగంలోకి దిగి కుక్కల వెంట పడ్డారు. అవి ఉండగా విమానం రన్ వేపై వెళ్ల కూడదు. మొత్తానికి చాలా సేపు కష్టపడి ఆ కుక్కల్ని పట్టుకున్నారు. చివరికి రాత్రి 9.52 నిమిషాలకు విమానం బయలుదేరింది. జరిగిన ఘటనకు ఎయిర్ పోర్టు అధికారులు మున్సిపల్ అధికారులను బాధ్యులు చేస్తున్నారు. ఎయిర్ పోర్టుకి దగ్గరలో పెద్ద కాలువ ఉందని దానిని మున్సిపాలిటీ వాళ్లు శుభ్రం చేయడం లేదని… అక్కడి నుంచే కుక్కలు విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్నాయని అంటున్నారు

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ఆయనకు వంద మంది భార్యలు
పోకిమన్ గో హిట్.. అడితే ప్రాణాలు ఫట్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
మా టీవీ లైసెన్స్ లు రద్దు
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
స్టే ఎలా వచ్చిందంటే..
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
దిగజారుతున్న చంద్రబాబు పాలన
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
జయ మరణం ముందే తెలుసా?
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
కేసీఆర్ దత్తత గ్రామాల్లో సంబరాలు

Comments

comments