నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం

Donald Trump down fall gragh

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందు నుండి అనుకున్నట్లుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నోటి దురుసు ఆయనను డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా వెనకబడేలా చేసింది. నిజానికి రెండు నెలల క్రితం సీన్ ఇందుకు భిన్నంగా ఉండేది. ట్రంప్ గురించి ఎంతో మంది చర్చించుకున్నారు. ఉగ్రవాద దాడులను టార్గెట్ గా చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఓరకంగా చెప్పాలంటే ఉగ్రవాదులను తాను ఎలా అడ్డుకుంటాను అన్న దానిపై చెప్పిన డొనాల్డ్ కొత్త చర్చకు తెర తీశారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముస్లింలను తన దేశంలో ఉండనివ్వనని, ముస్లింలకు తమ దేశంలో అనుమతించనని అనడం డొనాల్డ్ ట్రంప్ పతనానికి ఓ కారణమైంది. ఇక ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి రేసులో దూసుకెళుతుండగా గతంలో ఆయన చేసిన పలు వివాదాలు తెర మీదకు వచ్చాయి. మహిళల పట్ల ట్రంప్ వైఖరి తీవ్ర కలకలానికి కారణమైంది. హిల్లరీ మీద కేవలం విదేశాంగ శాఖ అధికార మెయిల్స్ వాడుకున్నారన్న ఆరోపణలు తప్ప ఎలాంటి ఆరోపణలు లేవు. కానీ ట్రంప్ విషయంలో అలా కాదు.. ప్రతి అంశంలోనూ వివాదాలున్నాయి. ఇప్పటికే ఆరుగురు మహిళలు ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ మీడియాకెక్కారు.

అమెరికన్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ట్రంప్ పై లైంగిక వ్యాఖ్యల ఆరోపణల పర్వం కొనసాగుతుండగా ఇప్పుడు తాను బాధితురాలేనని అంటూ గొంతు కలిపింది డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్. తాజాగా ఓ టీవి చానెల్ డిబేట్ లో పాల్గొన్న హిల్లరీ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమోన్మాదిగా మారిపోయిన ట్రంప్ తన వెంట కూడా పడ్డారని, మీదిమీదికొచ్చి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారని’ చెప్పారు. అయితే హిల్లరీ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశారు. హిల్లరీ ఆరోపణల్లో నిజం లేదని, కేవలం తనను ప్రతిష్ఠను మసకబార్చేందుకే హిల్లరీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు ట్రంప్.

మొత్తానికి ముందు నుండి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంత వివాదాస్పదంగా, ఇంత రాజకీయంగా జరగడం బహుశా ఇదే మొదటిసారి. డొనాల్డ్ ట్రంప్ మొన్నటి దాకా మెరిసినా ఇప్పుడు మాత్రం హిల్లరీ కన్నా వెనకబడ్డారు. ప్రతి అంశంలోనూ లేని చర్చకు దారితీసేలా.. తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం ట్రంప్ కు బాగా అలవాటు. గత రెండు టీవీ డిబేట్ లు ట్రంప్ పతనానికి చేదోడుగా నిలిచాయి. మొదటి డిబేట్ లో హిల్లరీ ఉన్నంత క్లారిటీగా ట్రంప్ లేకపోవడం, రెండో డిబేట్ లో హిల్లరీ మీద పరుష వ్యాఖ్యలు చెయ్యడం కూడా ట్రంప్ మైలేజ్ తగ్గడానికి కారణం. ఏదిఏమైనా డొనాల్డ్ ట్రంప్ గ్రాఫ్ తగ్గడానికి కారణం మాత్రం స్వయంకృతాపరాధమే అంటే తనకు తానుగా చేసుకున్నదే. మరి చూడాలి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో.

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
ఎవడిచ్చాడు ఆ ర్యాంకులు...?
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
టాప్ గేర్ లో ముద్రగడ
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ఎవరు చాణిక్యులు..?
మూడింటికి తేడా ఏంటి..?
ఇక యుద్ధమే కానీ..
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
తొక్కితే తాటతీస్తారు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
ఛీ..కొట్టించుకుంటున్న చంద్రబాబు నాయుడు
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments