బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్

Donald Trump shocking warning

అధ్యక్ష బాధ్యతలు చేపట్టక ముందే డోనాల్డ్ ట్రంప్ వివాదాస్ఫద నిర్ణయాలూ, వార్నింగ్ లూ ఇచ్చేస్తున్నాడు. తైవాన్ అధ్యక్షురాలికి ఫోన్ చేసి చైనాకు షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు అమెరికా కంపెనీలు సహా ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టే ఓ షాకింగ్ హెచ్చరిక చేశాడు. అమెరికాలో ఉన్న కంపెనీల్లో స్వదేశీయులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలనీ, విదేశీయులకు ఉద్యోగాలిస్తే ఊరుకోనంటూ హెచ్చరిక జారీ చేశాడు. తన మాట కాదనీ విదేశీయులకు ఉద్యోగాలిచ్చే కంపెనీలపై 35 శాతం పన్ను అదనంగా విధిస్తానంటూ స్పష్టం చేశాడు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే అమెరికా కంపెనీలను కూడా వదిలిపెట్టేది లేదంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్.

ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చి వ్యాపారం చేయాలనుకునే వారికీ, కంపెనీలు పెట్టాలనుకేవారికి మాత్రం పన్ను మినహాయింపులు భారీగా ఇస్తానని ప్రకటించాడు. ఎన్నికలకు ముందు అమెరికన్ల ఉద్యోగాలను విదేశీయులు ఆక్రమిస్తున్నారనీ, అమెరికాలో నిరుద్యోగం అంతమొందించేందుకు స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాననీ చెప్పిన ట్రంప్.. ఇప్పుడు ఆ దిశగా తీవ్రమైన నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్నాడు. ట్రంప్ తాజా హెచ్చరికలతో వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్ళి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విదేశాంగ విధానాలను సైతం మార్చేస్తాననీ, విదేశాల నుంచి వచ్చే వారికి ఉద్యోగాలు ఇవ్వబోమనీ చెప్తున్న ట్రంప్ వైఖరి పట్ల ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపడితే పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
అతడికి గూగుల్ అంటే కోపం
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
ఓడినా విజేతనే.. భారత సింధూరం
నయీం బాధితుల ‘క్యూ’
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
మోదీ చేసిందంతా తూచ్..
తెలంగాణ 3300 కోట్లు పాయె
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
బినామీలు భయపడే మోదీ ప్లాన్
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
ట్రంప్ సంచలన నిర్ణయం
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
పవన్ పంచ ప్రశ్నలు
మోదీ మీద మర్డర్ కేసు!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments