హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?

Kill-hillary

అమెరికాలో ఎక్కువగా తూటాలు.. డొనాల్డ్ ట్రంప్ నోటి నుండి మాటలు ఎప్పుడూ పేలుతూనే ఉంటాయి. తాజాగా ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హిల్లరీ క్లింటన్ ను పరోక్షంగా చంపండి.. అన్నట్లు డొనాల్డ్ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షపదవిలో పోటీ చెయ్యడానికి అనర్హుడు అంటూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముందు నుండి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఏకంగా హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చెయ్యడం మరోసారి కలవరపెడుతోంది.

తుపాకి లైసెన్స్ ఉన్న ప్రతి అమెరికన్ పౌరుడు హిల్లరీ క్లింటన్ వైట్ హౌస్ కు చేరకుండా ఆపగలరని అభిప్రాయపడ్డారు. దీంతో ట్రంప్ హిల్లరీని కాల్చిచంపాలని సూచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిల్లరీ అధికారంలోకి వస్తే అమెరికన్లకు మాత్రమే వర్తించే గన్ లైసెన్స్ ‘సెకండ్ అమెండ్ మెంట్’ను తొలగిస్తారని ట్రంప్ విల్మింగ్ టన్ ప్రచార కార్యక్రమంలో అన్నారు. అమెరికాలో సెకండ్ అమెండ్ మెండ్ ద్వారా లబ్ధి పొందుతున్న ఓటర్లు రికార్డు స్థాయిలో ఉన్నారు. వారిని ఆకర్షించడానికే ట్రంప్ ఆ వ్యాఖ్య చేశారే తప్ప.. హిల్లరీని చంపాలన్నది అతడి టార్గెట్ కాదు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గన్ లైసెన్స్ కలిగివున్న వాళ్లందరిలో అఖండ శక్తి ఉందని.. వారికి ఎవరికి ఓటువేయాలో బాగా తెలుసునని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను బట్టే ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో అర్థమవుతుంది అని అంటున్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments