హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం

Donald Trump won American Presidential Elections on Hillary Clinton

అమెరికాలో రాజకీయం రసవత్తరంగా సాగింది. చివరి వరకు అమీతుమీ అన్నట్లు సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూసింది. అలాంటి హోరాహోరీలో చివరకు హిల్లరీ ఆశలు నీరుగారిపోయాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. వివాదాస్ప‌ద వ్యాఖ్యాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ట్రంప్ తిరుగులేని ఆధిక్యంతో విజ‌యం సాధించారు. మొత్తంగా ట్రంప్ 288 ఓట్లు, హిల్ల‌రీ 218 ఓట్లు సాధించారు. మ్యాజిక్ ఫిగ‌ర్ ను సులువుగా దాటేయ‌డంతో ట్రంప్ అభిమానులు ఆనందోత్స‌వాలు జ‌రుపుకున్నారు. 49 శాతం ఓట్లు ఆయ‌న సాధించారు.

రెండు మార్లు వ‌రుస ప‌రాజ‌యాల రిపబ్లిక‌న్ల‌కు ఆయ‌న విజ‌యం రుచిచూపించారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్న‌దే ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ప్ర‌పంచంలో స‌మూల మార్పుల‌కు ట్రంప్ విజ‌యం సూచిక‌గా ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌పంచ ప‌రిణామాల్లో ఈ విజ‌యం ప‌లు ప‌రిణామాల‌కు దారితీయ‌వ‌చ్చ‌న్న‌ది అంతా చెబుతున్న విష‌యం.

ముఖ్యంగా 20ల‌క్ష‌ల మంది వ‌ల‌స‌దారుల‌పై ఎలాంటి నిర్ణ‌యాలుంటాయ‌న్న‌ది అంతా చర్చ‌నీయాంశంగా మారోబోతంది. ముఖ్యంగా భార‌తీయుల మీద ఎలాంటి ప్ర‌భావం చూపిస్తారో చూడాలి. రాబోయే ఏడాది జ‌న‌వ‌రంలో ఒబామా స్థానంలో ట్రంప్ పీఠం ఎక్క‌బోతున్నారు. వైట్ హౌస్ లో ట్రంప్ అడుగుపెట్టిన త‌ర్వాత ఎలాంటి మార్పులుంటాయో చూడాలి. అమెరికా 45వ అధ్య‌క్షుడిగా ట్రంప్ ఎన్నిక‌కావ‌డంతో న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో రిప‌బ్లిక‌న్ల సంద‌డి క‌నిపిస్తోంది.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
సైన్యం చేతికి టర్కీ
ఓడినా విజేతనే.. భారత సింధూరం
ఆటలా..? యుద్ధమా..?
చెరువుల్లో ఇక చేపలే చేపలు
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
సౌదీలో యువరాజుకు ఉరి
సల్మాన్ ను వదలని కేసులు
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
మరో బాంబ్ పేల్చిన నరేంద్ర మోదీ
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
పాపం.. బాబుగారు వినడంలేదా?

Comments

comments