ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే

Earn Money with Freelancing

ఉదయాన్నే ఆఫీస్ కు వెళ్లి… సాయంత్రం వరకు కష్టపడి వచ్చే వాళ్లు మనలో చాలా మంది ఉంటారు. ఒక్క లీవ్ కావాలి అంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బుర్రలో గుజ్జు ఉంటే చాలు సంపాదన చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఫ్రీలాన్సింగ్ తీసుకోండి. ఫ్రీలాన్సింగ్ ఉంటే ఎంచక్కా…హాయిగా పనిచేసుకోవచ్చు. బుద్ధి పుట్టినప్పుడు పని చేయొచ్చు..లేకపోతే లేదు..అంటున్నారు. ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు..ఒకళ్ల గురించి భయపడక్కర్లేదు..జీతం కూడా బాగానే వస్తుందని కొంతమంది పేర్కొంటున్నారు. ఇంట్లోనే కూర్చుని చేసే ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇష్టం వచ్చినప్పుడు, ఇల్లు కదలకుండా, సౌకర్యంగా పనిచేసుకోవచ్చు. సంపాదించుకన్నంత సొమ్ము. ఈ ఫ్రీలాన్స్ ఉద్యోగాలు ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యనున్న యువకులు వీటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

freelance-image

ఫ్రీలాన్సింగ్ ద్వారా రోజుకు ఏకంగా రూ. 46 వేల వరకు డబ్బులు సంపాదిస్తున్నారంట. ‘ఫ్లెక్సింగ్ ఇట్’ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తేలిదంట. ఫ్రీలాన్సింగ్ అవకాశాల కోసం ఎదురు చూసే ప్రొఫెషనల్స్ కు..వాళ్లతో పని చేయించుకోవాలని చూసే సంస్థలకు వారధిగా ‘ఫ్లెక్సింగ్ ఇట్’ సంస్థ పనిచేస్తోంది. 2,500 మంది ప్రొఫెషనల్స్ నుండి సమాచారం సేకరించింది. 2016 జనవరి నుండి 2016 జులై వరకు సమాచారాన్ని సేకరించారు. ఫ్రీ లాన్సింగ్ లో ఐదేళ్ల వరకు అనుభవం ఉన్న వారికి ఉత్పాదక రంగం..ఆర్థిక రంగం, సేల్స్ వంటి రంగాల్లో అత్యధికంగా చెల్లిస్తున్నారని తేలింది. అలాగే 20 ఏళ్ల అనుభవం ఉన్న వారిలో ఎక్కువగా ఫైనాన్స్..జనరల్ మేనేజ్ మెంట్..స్ట్రాటజీ..హ్యూమన్ రిసోర్సిస్ లాంటి రంగాల్లో ఎక్కువ చెల్లింపులు వస్తున్నాయంట. ఐదేళ్లలోపు అనుభవం వారికి రోజుకు రూ. 8వేలు..5 నుంచి 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్న వారికి రోజుకు రూ. 19వేలు, 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవాళ్లు రోజుకు రూ. 46 వేల వరకు ఫ్రీలాన్సింగ్‌లో సంపాదిస్తున్నారట.

పాపులర్ ఫ్రీలాన్సింగ్ సైట్లు:
www.flexingit.com
www.upwork.com

ఇండస్………………………… రోజుకు సంపాదన(రూపాయల్లో)
టెలికాం మరియు ఇంటర్నెట్ సర్వీసులు….9800
ఐటీ సర్వీసెస్…………………………..8800
ఈ కామర్స్/రీటెయిల్………………….7500
బ్యాంకులు మరియు ఫైనిన్షియల్………..7200
అడ్వర్టైజింగ్, మీడియా అండ్ పబ్లిషింగ్…….3700

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
పెట్రోల్ లీటర్‌కు 250
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
అతడికి గూగుల్ అంటే కోపం
బురఖా నిషేదం.. వేస్తే భారీ జరిమాన
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
ఆటలా..? యుద్ధమా..?
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాబు గారి అతి తెలివి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
తిరిగబడితే తారుమారే
రాహుల్ గాంధీకి మోక్షం..అంతా సిద్ధం
యుపీలో ఘోర రైలు ప్రమాదం
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం

Comments

comments