గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు

Eenam Gambhir excellent speech in UN

పాకిస్థాన్ ప్రధాని ఐక్యరాజ్య సమితి వేదికగా అబద్దాలు మాట్లాడారు. శాంతి కోసం పాకిస్థాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే భారత్ మాత్రం ముందుకు రావడం లేదని పలికారు. అయితే దీని మీద భారత్ తరఫున కూడా గట్టి జవాబు వినిపించింది. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ఈనమ్ గంభీర్ మాటల తూటాలు పేల్చారు. ఆమె మాట్లాడిన స్పీచ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిసింది.

ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇవ్వడంతో భారత్‌ సహా పొరుగు దేశాలు-అలాగే అమెరికా తో సహా అనేక సార్వభౌమ రాజ్యాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఈనమ్ గంభీర్  అన్నారు. పాక్ వల్ల ఉగ్రవాద సంస్థలకు వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ సహాయం అందుతోందని, దీంతో ఉగ్రవాద శిక్షణ, వారికి ఆర్థిక సాయం, పొరుగుదేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నాయని చెప్పారు. అధికారుల ఆమోద ముద్రతోనే పాక్‌లో ఉగ్రసంస్థలు నిధులు సమీకరించుకుంటున్నాయన్నారు. పాక్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చరిత్ర మోసాలు, వంచనతో కూడిందన్నారు.

అంతర్జాతీయ సమాజానికి ఉగ్రవాదంపై అబద్ధపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు విద్యకు ప్రసిద్ధి గాంచిన తక్షశిల ఇప్పుడు ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఉగ్రవాద మద్దతుదారులు, శిక్షకులకు తక్షశిల స్థావరంగా మారిందన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించే క్రమంలో యూరీ సెక్టర్ లో ఉగ్రదాడి ఒక ట్రయల్ మాత్రమే అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యల నుంచి దేశ పౌరులను కాపాడటానికి భారత్ సిద్ధంగా ఉందని, ఉగ్రవాదాన్ని ఏ విధంగానూ అంగీకరించేది లేదని ఈనమ్ గంభీర్ చెప్పారు.

కాగా ఈనమ్ గంభీర్ స్పీచ్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎవరు ఎలా స్పందించారో మీరూ చూడండి.

Related posts:
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
బాబు బండారం బయటపడింది
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
దిగజారుతున్న చంద్రబాబు పాలన
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
మోదీ హీరో కాదా?
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
ట్రంప్ సంచలన నిర్ణయం
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా అక్కినేని నాగార్జున అంశం
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments