8మందిని వేసేశారు… సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం

Eight SIMI terrorist killed in Encounter

ఎనిమిది మంది సిమి ఉగ్రవాదులను మధ్యప్రదేశ్ పోలీసులు ఎన్ కౌంటర చేసి హతమార్చారు. భోపాల్ సెంట్రల్ జైల్ నుండి తప్పించుకున్న వీరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. జైలు  సెక్యూరిటీ గార్డు రామశంకర్‌ యాదవ్‌ గొంతు కోసి హత్య చేసి, సిమి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. బ్యాంకుల దోపిడి, హత్య, దేశద్రోహం వంటి నేరాల్లో ఆరోపణలున్న  సిమి కార్యకర్తలు వారు కప్పుకునే దుప్పట్లను తాడులా పేని జైలు గోడలను దాటారు. తెల్లవారుజామున 3గంటల సమయంలో సెక్యూరిటీ గార్డులు తమ డ్యూటీలు మారే తరుణంలో సిమి కార్యకర్తలు గార్డులపై కలబడి వారిని తన్నారని సమాచారం.

భోపాల్‌ జైలు నుండి తప్పించుకున్న వారిలో ముగ్గురు 2013లో ఖాండ్వా జైలు నుండి తప్పించుకున్నవారే, తర్వాత వారిని తెలంగాణా పోలీసులు పట్టుకున్నారు. కాగా ప్రస్తుతం జైలు నుండి తప్పించుకున్న సిమి కార్యకర్తలను జైలుకు 10కిలోమీటర్ల దూరంలో నగర శివార్లలో పట్టుకుని కాల్చి చంపారు. నగర పోలీసులు, ఎటిఎస్‌ బృందం కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో వీరిని హతమార్చారు. గ్రామస్తుల నుండి అందిన సమాచారం మేరకే తాము అక్కడకు వెళ్ళామని పోలీసులు చెబుతున్నారు. ముందుగా లొంగిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కానీ వారు మాత్రం పట్టించుకోలేదని, దాంతో ఎన్ కౌంటర్ కు పాల్పడాల్సి వచ్చిందని తెలిసింది. కాగా ఈ ఎన్ కౌంటర్ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు కావాలనే ఎన్ కౌంటర్ చేశారని కొంత మంది మానవ హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
కాటేసిందని పాముకు శిక్ష
సైన్యం చేతికి టర్కీ
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
ఆట ఆడలేమా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
నయీం రెండు కోరికలు తీరకుండానే...
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
పిహెచ్‌డి పై అబద్ధాలు
జియోకే షాకిచ్చే ఆఫర్లు
గెలిచి ఓడిన రోహిత్ వేముల
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మావో నాయకుడు ఆర్కే క్షేమం
అమెరికా ఏమంటోంది?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
తిరిగిరాని లోకాలకు జయ
అమ్మను పంపించేశారా?
అపోలోలో శశికళ మాస్టర్ ప్లాన్
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
బుల్లెట్ బాబా...అక్కడ బైకే దేవుడు.. దానికే పూజలు

Comments

comments