అడవిలో కలకలం

Encounter in Andhra-Odisha Boarder

కొన్నేళ్లుగా ప్ర‌శాంతంగా ఉన్న అడ‌వుల్లో అల‌జ‌డి రేగింది. ఆంధ్రా- ఓరిస్సా బార్డ‌ర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీలో మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో మల్కాన్ గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు వద్ద ఆంధ్రా గ్రేహౌండ్స్-ఒడిశా ఎస్ ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు.

మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఏవోబీలోని మల్కన్ గిరి ప్రాంతాన్ని నిన్నటి నుంచి జల్లెడపడుతున్నారు. తెల్లవారుజామున పోలీసులు – మావోలు ఎదురు పడటంతో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 24 మంది మావోయిస్ట్ లు చనిపోయారు.  ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం అంతా భయానకంగా ఉంది. తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

సంఘటన స్థలం దగ్గర నాలుగు ఏకే 47 గన్లు, SLR తుపాకులు, మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ పూర్తయినా.. పోలీసులు మాత్రం మల్కన్ గిరి అటవీప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. తప్పించుకున్న మావో అగ్రనేతల కోసం  గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కూంబింగ్ లో మాజీ మావోయిస్టుల సహకారం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్లీనరీ సమావేశానికి 100 మందికి పైగా మావోలు హాజరయినట్లు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఆంధ్ర, ఒడిశా పోలీసులు, కేంద్ర బలగాలు జాయింట్ ఆపరేషన్ గా మావో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు – మావోలు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మావో కీలక నేతలు చనిపోయారని తెలుస్తోంది. మృతుల్లో విశాఖ ఏరియా కార్యదర్శి గాజుల రవి అలియాస్ ఉదయ్, చలపతి, దయ, రాజన్న, ఆర్కే కుమారుడు మున్నా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 8 మంది మహిళా మవోయిస్టులు కూడా ఉన్నారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
సైన్యం చేతికి టర్కీ
బాబోయ్ బాబు వదల్లేదట
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
కాశ్మీర్ భారత్‌లో భాగమే
సల్మాన్ ను వదలని కేసులు
జగన్ సభలో బాబు సినిమా
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఆ సిఎంను చూడు బాబు...
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
పవన్ పంచ ప్రశ్నలు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
నరేంద్రమోదీ@50 రోజులు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments