పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక

Errabelli Dayakar Rao Facing most hard time in his political life

ఓడలు బళ్లు బళ్లు ఓడలు కావడం అంటే చాలా మందికి తెలుస్తుంది. ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు చెడిన వారి గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు తెలంగాణలో కొంత మంది పరిస్థితి ఇలానే ఉంది. అందునా ముఖ్యంగా వరంగల్ కు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి మాట్లాడాలి. ఒకప్పుడు తెలంగాణ తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన అయ్యవారు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని కారెక్కారు. కారెక్కిన టైం బాగోలేదో.. లేదంటే టైం తనకు కలిసి రావడంలేదో కానీ మొత్తానికి బ్యాడ్ గానే ఉంది.

టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా రాజకీయాలలో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పేరుంది.గులాబీ తీర్థం పుచ్చుకోగానే సీనంతా ఒక్కసారిగా రివర్స్ యింది.తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్‌రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభించడం లేదు.పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ అనుకున్న దయన్నకు టిఆర్ఎస్‌లో గడ్డు పరిస్థితులు ఎదురువుతూనే ఉన్నాయి.ఎర్రబెల్లి సామాజిక వర్గానికి చెందిన నలుగురు సిఎం క్యాబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతున్నారు దీంతో ఎర్రబెల్లిని భర్తీ చేయడం కష్టమేనన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరంగల్ జిల్లాకే చెందిన డిప్యూటి సిఎం కడియం శ్రీహరితో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తాను క్యాబినేట్‌లో చేరే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి చెబుతున్నారని సమాచారం.దయాకర్‌రావు పార్టీ మారినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడ జిల్లా పార్టీ కార్యాలయంలోకి రాకపోవడం గమనార్హం.తెలంగాణలో టిడిపి నమ్మిన వ్యక్తులలో ఆయన ఒకరు,కానీ ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నపుడు దయాకర్‌రావుకు మంత్రిగా పనిచేసే అవకాశం రాలేదు.

సరే విభజన తర్వాత టిఆర్ఎస్ దాడిని తట్టుకోలేకపోయాడు,ఈ పరిస్థితులలో పార్టీ మారిన దయాకర్‌రావు పునరాలోచనలో పడ్డారని సమాచారం.చంద్రబాబు వద్ద పనిచేసే రోజులలో తనకు మంచి ప్రాధాన్యత ఉండేదని టిఆర్ఎస్‌లోకి వచ్చాక తన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని అంటున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఇన్ని పరిస్థితుల మద్య ఎర్రబెల్లి టిఆర్ఎస్‌లో నెట్టుకురావడం కష్టమని అంటున్నారు. మొత్తానికి ఒకప్పుడు పూలు అమ్మిన ఎర్రబెల్లి ఇప్పుడు కాలం కలిసిరాక కట్టెలు కూడా అమ్మలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ ప్లాన్ ఏంటి..?
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
టెర్రరిస్టులకు ఓవైసీ సపోర్ట్ ఎందుకు? పచ్చినిజాలు
లాఠీ, కేసీఆర్ ఓ ముచ్చట
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
వాడు మగాడ్రా బుజ్జి కాదు.. నిజమైన హిజ్రా వీడేరా
జీఎస్టీ బిల్ కథ..
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ చంద్రుడి చక్రమే
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
దీక్షల వల్ల వచ్చేదేముంది..?
ఊరట పవన్ ఫ్యాన్స్ కు
నో షేక్.. ఇక హ్యాండే.. టీడీపీకి పవన్ మద్దతు లేనట్టే!
మమ్మల్ని క్షమించు.. మమ్మల్ని మన్నించు
అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
పిట్టల దొరను మించిన మాటల దొర
పవన్ క్షమాపణలు చెప్పాలి
జయలలిత జీవిత విశేషాలు

Comments

comments