అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..

Even Developed countries cant do that but modi

అమెరికా, జపాన్, బెల్జియం లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా సాధ్యంకాని ఓ మహత్తర కార్యానికి మోదీ పూనుకున్నారు. నిజానికి మోదీ అనుకున్న పని మనకు మంచి చేసేదే కానీ అది ఆచరణ సాధ్యమా? కాదా? అనే దాన్ని లెక్కలు వేయడంలో ఆయన విఫలమయ్యారు అనే వార్త వినిపిస్తోంది. ఇంతకీ మోదీ ఏ కార్యం చేయాలనుకుంటున్నారు? అనేగా మీ అనుమానం. దేశాన్ని క్యాష్ లెస్ గా మారుస్తానని మోదీ పదేపదే చెబుతున్నారు. నల్లధనం రూపుమారాలి అంటే దేశంలో క్యాష్ లెస్ సిస్టం రావాలని మోదీ గట్టిగా వాదిస్తున్నారు. అయితే ఇక్కడ మోదీ గత చరిత్రను మరిచిపోతున్నారు. కనీసం వేరే దేశాల్లో పరిస్థితినైనా ఆయన గమనించి అడుగులు వేస్తే సరిపోతుంది.

భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే. కానీ అభివృద్ధి చెందిన అమెరికాలాంటి దేశాల్లో కూడా ఇంకా క్యాష్ లెస్ సాధ్యంకాలేదు. అమెరికాలో ఇప్పటికీ నగదు ద్వారా కొన్ని లావాదేవీలు జరుగుతున్నాయి అంటే క్యాష్ లెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సింగపూర్‌లో నగదు రహిత లావాదేవీలు 61 శాతంగా ఉండగా, జపానలో 14, చైనాలో 10 శాతం ఉంది. యుఏఇలో 8, దక్షిణాఫ్రికాలో 6, రష్యాలో 4, మలేసియాలో 1 శాతం మాత్రమే క్యాష్‌లెస్‌ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ దేశాల్లో బ్యాంకింగ్‌ వేగంగా విస్తరిస్తున్నా.. నగదు వినియోగం మాత్రం పూర్తిస్థాయిలో తగ్గలేదు. కానీ మన దేశంలో మాత్రం మోదీ క్యాష్ లెస్ కోసం తహతహలాడుతున్నారు.అయితే మోదీ ఆశించన దానిలో ఎలాంటి తప్పులేకున్నా కూడా వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచనలు చేస్తే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు.

Related posts:
అతడికి గూగుల్ అంటే కోపం
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
వాళ్లను వదిలేదిలేదు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
లక్షన్నర కోట్ల అవినీతి బాబు రెండున్నరేళ్ల పాలనలో
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
జగన్ సభలో బాబు సినిమా
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ హీరో కాదా?
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
ఆ నోట్లను ఏం చేయబోతున్నారంటే..
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
తొలి క్యాష్‌లెస్ టెంపుల్..యాదాద్రి
కాంగ్రెస్ నేత దారుణ హత్య
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments