మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం

Every thing clear for Mallanna Sagar in Telangana

తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన మల్లన్నసాగర్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.నిన్నటిదాకా ఆందోళనలతో వార్తల్లోకెక్కిన ముంపు గ్రామాలు ఒకదాని వెనుక మరొకటిగా ప్రభుత్వంతో సహకరించేందుకు ముందుకొచ్చాయి. మొన్న ఏటిగడ్డకిష్టాపూర్, నిన్న పల్లెపహాడ్ గ్రామస్థులు ముందుకు రాగా గురువారం ఎర్రవల్లి గ్రామస్థులు కూడా 123 జీవో ప్రకారం తమ భూములను అప్పగించడానికి ముందుకు వచ్చా రు. ప్రధానంగా ఈ గ్రామాల్లోనే ఆందోళనలు జరిగాయి. ఇపుడు ఆ గ్రామాలన్నీ భూములు అప్పగించేందుకు ముందుకు రావటం విశేషం.

మల్లన్నసాగర్ ముంపునకు గురయ్యే 8 ప్రధాన గ్రామాలు కూడా అంగీకరించడంతో హర్షం వ్యక్తమవుతున్నది.మరోవైపు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో దీక్షలు నిర్వహించిన టెంట్లలో భూములు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్న అధికారులు,ఇపుడు పల్లెపహాడ్, ఎర్రవల్లి గ్రామాల్లో కూడా ఆందోళనలు చేసిన చోటే ప్రత్యేక క్యాంపుల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాటు చేస్తున్నారు.మంత్రి తన్నీరు హరీశ్‌రావును వారు కలుసుకున్నారు.ఈ సందర్భంగా తమ సందేహాలను మంత్రి ముందు ఉంచారు.మంత్రి వారితో ఓపికగా చర్చించి 123 జీవోవల్ల ప్రయోజనాలు వివరించారు.

ముంపు ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దీనితో రైతులు సంతృప్తి చెందిన రైతులు తమ భూములు అప్పగించేందుకు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసి మంత్రికి అందజేశారు.అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు మల్లన్న సాగర్ జై.. జైజై మల్లన్న సాగర్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులపై తమకు పూర్తి నమ్మకముందని రైతులు పేర్కొన్నారు. మొత్తానికి కేసీఆర్ సర్కార్ కు గుదిబండగా మారిన మల్లన్నసాగర్ ను కాస్త లేట్ అయినా పరిష్కరించారు హరీష్ రావు.

Related posts:
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
తాగుబోతుల తెలంగాణ!
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పాక్‌కు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ర్యాలీలు
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
2018లో తెలుగుదేశం ఖాళీ!
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
అర్నాబ్ గోస్వామి రాజీనామా ఎందుకు? సోషల్ మీడియాలో వెరైటీ స్పందన
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
తెలంగాణ 3300 కోట్లు పాయె
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు

Comments

comments