బిచ్చగాళ్లు కావలెను

Everybody Need Beggars

ఇప్పటి దాకా జాబులు కావలెను.. డబ్బులు కావలెను.. అని ప్రకటనలు చూసి ఉంటారు. కానీ బిచ్చగాళ్లు కావలెను అనే టైటిల్ ఎప్పుడూ చూసి ఉండరు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బతో ఇప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. జనాలు తీవ్ర చిల్లర కష్టాలుపడుతున్నారు. బ్యాంకుల దగ్గర లైన్లో నిల్చుంటున్నా కానీ చిల్లర మాత్రం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిన్నటి దాకా చిల్లర విసిరేసిన బిచ్చగాళ్లు ఇప్పుడు చాలా మందికి గుర్తుకు వస్తున్నారు. గతంలో తాము విసిరిన చిల్లర ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు.

బతకలేక బిచ్చగాళ్లు మారి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, బస్టాండుల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే గతంలో బిచ్చగాళ్ల బెడద సామాన్యులకు ఇబ్బందిగా మారిందంటూ ప్రభుత్వ పెద్దలు తలలు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు చిల్లర అంటే అలా ఇలా కాదు పెళ్లిళ్లనుంచి శుభకార్యాల వరకు అన్నింటి రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నిన్న పెళ్లిచేసుకునే వరుడు సైతం చిల్లర కోసం క్యూలైన్లో నిలుచున్నాడు. మరికొందరు చిల్లరలేక నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తమ దగ్గర్లో ఎవరైనా బిచ్చగాళ్లు ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే బిచ్చగాళ్ల దగ్గర చిల్లర ఉంటుంది. వారి దగ్గర ఉన్న నోట్లును వారికిచ్చి ఈ చిల్లర కష్టాలనుంచి బయటపడాలని చూస్తున్నారు.  మరోవైపు బడాబాబులు మాత్రం బిచ్చగాళ్లను బాగానే వినియోగించుకుంటున్నట్లు సమాచారం. తమ దగ్గరున్న పది లక్షల పాత కరెన్సీ ఇచ్చి బిచ్చగాళ్ల దగ్గరున్న ఐదు లక్షల చిల్లర తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ చిల్లర కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో చూడాలి.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
సింగ్ ఈజ్ కింగ్
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
బాబుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
యుద్ధం మొదలైందా..? పాకిస్థాన్ మీద భారత్ దాడి
తెలంగాణలో 2019 గెలుపు గోడలపై రాసుంది
ఆప్ కాదు పాప్ వర్మ... ట్వీట్ కు దిల్లీ సిఎం దిమ్మతిరిగింది
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
తిరిగబడితే తారుమారే
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు
జియో భారీ ఆఫర్ తెలుసా?

Comments

comments