గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!

Ex Minister Uma Madhava Reddy respond on Nayeem alligation

తెలంగాణలో ఎంతో కాలంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. కాగా నయీం చనిపోయిన తర్వాత తీగలాగిన కొద్దీ ఒక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. కొంత మంది డిఎస్పీలతో సహా పోలీస్ అధికారులతో నయీంకు సత్సంబంధాలున్నాయని తెలిసింది. ముఖ్యంగా మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డితో నయీంకు సంబందాలున్నాయని వార్తలు వచ్చాయి. ఆమెతో నయీం చాలా సార్లు మాట్లాడారట.. కొన్ని సెటిల్ మెంట్ల విషయంలో కూడా నయీం ఉమా మాధవరెడ్డిని సంప్రదించినట్లు కొన్ని మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి.

నయీంకు మాజీ మంత్రి ఉమా మాధవ్ రెడ్డికి సంబంధాలున్నాయంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించారు. నయీంతో నాకు సంబంధాల్లేవ్.. అసలు నాకు అతనికి సంబంధాలున్న మాట అవాస్తవం అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీంకు నేను పలుమార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు కదా.. నా భర్త చనిపోక ముందు నుంచి ఇదే ఫోన్ ను వాడుతున్నా.. మరి నాకు తెలియకుండా ఎలా ఫోన్లు వెళతాయ్ అంటూ ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆమె స్పష్టం చేశారు. నా కాల్ లిస్ట్ బయటపెడితే నిజానిజాలు తెలుస్తాయి కదా ప్రభుత్వం ఏం చేస్తుంది.. నాకు ఏం సమాధానం ఇస్తుందో చెప్పాలంటూ ఆమె ఆగ్రహించారు.  ఈ కుట్ర కుతంత్రాలన్నీ తెలంగాణ ప్రజానీకం తెలుసుకోవాలన్నారు. మా కుటుంబాన్ని ఆగం చేసేందుకు ప్రభుత్వం పన్నాగం చేస్తోంది.. ఇందుకు పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు.

నా ఫోన్ నుంచి నయీంకు కాల్స్ పోయినట్లు నిరూపించాలని కేసీఆర్ సర్కార్, కేసీఆర్‌కు ఆమె చాలెంజ్ చేశారు. నిజా నిజాలు బయటపెట్టేందుకు జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సిట్ పై నాకు నమ్మకం లేదు.. సిట్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని ఆమె చెప్పారు. నేను చేయని తప్పుకు ఎందుకు ఊరుకోవాలి.. ఒక మహిళ అని చూడకుండా మాఫియాతో లింకు పెట్టడం మీకు సబబేనా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే మాత్రం జైలు వెళ్లడానికి సిద్ధమన్నారు.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
అరుణకు ఏకంగా ఆ పదవి? టిఆర్ఎస్ భారీ ఆఫర్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments