మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్

Excellecnt Black Money plan greater than Modi's plan

యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ నెల ఎనిమిదో తేదీన మోదీ చేసిన ప్రకటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నానని, ఇక మీదట అవి కేవలం చిత్తుకాగితాలుగా మాత్రమే పనికివస్తాయని మోదీ పత్రికా ముఖంగా ప్రకటించేశారు. దాంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. నల్లకుబేరులు దాచుకున్న డబ్బులు ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి. నల్లడబ్బును వెలికితీసేందుకు మోదీ పెద్ద నోట్ల బ్యాన్ తీసుకువచ్చారు.. అయినా ఇది కేవలం మన దేశంలో అక్రమంగా దాచుకున్న నల్లధనాన్ని మాత్రమే వెల్లడిస్తుంది. కానీ మోదీని మించిన ప్లాన్ ఒకటి ఉంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడకట్టుకున్న మొత్తం అవినీతి సొమ్ము దిమ్మతిరిగే బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది.

పన్నులు కట్టకుండా, అక్రమ మార్గాల్లో కోట్లకు కోట్లు సంపాదించి, వాటిని అక్రమ మార్గాల్లో దాచుకుంటున్నారు నల్లకుబేరులు. అలాంటి నల్లకుబేరులు దాచుకున్న డబ్బులు ఒక దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో దాచుకుంటున్నారు. అవినీతి సొమ్ములో మన దేశమే టాప్ కాదు.. ఎన్నో దేశాలు ఈ విషయంలో మనతో పోటీపడుతున్నాయి. మరి అన్ని దేశాల్లో మూలాలకు పాతుకుపోయిన అవినీతి సొమ్ము, అక్రమసొమ్మును నిర్మూలించాలంటే మోదీ వల్ల కాదు. కానీ ఒకరి నిర్ణయం వల్ల మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అదెలాగంటే..

మొన్నీమధ్యన ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులకు, స్మగ్లర్ల దగ్గరి నుండి అమెరికా డాలర్లు లభ్యమయ్యాయి. మామూలుగా అయితే ఇలాంటి అంశాల్లో మన దేశ కరెన్సీ లేదంటే బంగారం దొరుకుతుంది. కానీ ఇలా అమెరికా డాలర్లు దొరకడం విశేషం. ఇంతకీ అమెరికా డాలర్లు ఎందుకు దొరికాయి.. ? అనేది ప్రశ్న. ప్రపంచంలోని చాలా దేశాల్లో మారిపోయే కరెన్సీ అమెరికా కరెన్సీ. ఆసియా దేశాల్లో చాలా వరకు అమెరికా కరెన్సీ అంటే చాలా విలువ. మామూలుగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక డాలర్ అంటే 58 నుండి 68 రూపాయలుంటుంది. కరెక్ట్ గా ఇదే లాజిక్ ను చాలా మంది బడా బాబులు పట్టేశారు. దేశంలోకి వస్తున్న అమెరికన్ కరెన్సీని, తమ అక్రమ సొమ్ముగా మారుస్తున్నారు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. మోదీ సర్కార్ రాక ముందు అమెరికా నుండి వచ్చే పౌరుడు(భారతీయుడు) తనవెంట 50వేల అమెరికన్ డాలర్లు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఆ లిమిట్ ను ముందుగా 75వేల డాలర్లకు పెంచింది. తర్వాత ఏకంగా చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఏకంగా లక్షా యాభైవేల డాలర్ల వరకు భారత్ కు అమెరికన్ డాలర్లను తీసుకురావచ్చు.

ఒక వంద డాలర్ల నోటు ఉంటే.. దాని విలువ మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఆరు వేల ఐదువందల రూపాయలు. ఈ లెక్కన లక్ష రూపాయలను డాలర్ల కింద మారిస్తే దాదాపుగా 1477 అమెరికన్ డాలర్లు. అంటే మనం బస్తాల్లో నింపే డబ్బును అమెరికా డాలర్ల కిందకి మారిస్తే కేవలం రెండు కట్టల కిందకు చేరుతుందని కూలంకుషంగా అర్థం. మొత్తానికి మన డబ్బులను అమెరికన్ డాలర్లుగా మారిస్తే పని చాలా ఈజీగా అవుతోంది. అందుకే అసలు ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా కూడా మనలాగే పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటి?

ఎన్నో సంవత్సరాలుగా వింటున్న అవినీతి సొమ్ము, అక్రమ సొమ్ము ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు నిర్మూలించబడుతుంది. ఇప్పుడు మన దేశంలో మోదీ ఎలాగైతే పెద్ద నోట్లను బ్యాన్ చేసి, వాటి స్థానంలో ఐటీ శాఖ రూల్స్ ప్రకారం డబ్బులను ఉంచుకోవచ్చో అదేరకంగా అమెరికన్ డాలర్లను బ్యాన్ చేసి, వాటి స్థానంలో కేవలం అకౌంట్లలో మాత్రమే డబ్బులు వచ్చేలా, చిన్న కరెన్సీని మాత్రమే ప్రవేశపెడితే ప్రపంచంలోని అందరు నల్లకుబేరులకు బొమ్మ కనిపిస్తుంది. కానీ అమెరికా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాలి. అదే గనక జరిగితే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రపంచదేశాలకు నిజంగా వెలుగురేఖలు వస్తాయి.

Related posts:
కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత...?
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
మహేష్ పొలిటికల్ ఎంట్రీపై మోహన్ బాబు ఏమన్నాడంటే..
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
మల్లన్న సాగర్ కు మొదటి బలి హరీష్ రావు
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
ఏం చేసినా తప్పు అంటే ఎలా..?
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ మాస్టర్ స్కెచ్
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
చంద్రబాబుకు పవన్ లెంపకాయ
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
పవన్ పనికిమాలిన స్ట్రాటజీ అదే!
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?

Comments

comments