జియోకే షాకిచ్చే ఆఫర్లు

Excellent offers from Vodafone and Airtel in the Competetion for Jio

రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్లను తట్టుకునేందుకు అన్ని కంపెనీలు రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే BSNL, ఎయిర్ టెల్ ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా  వొడాఫోన్ ఇండియా కూడా ఓ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 1జీబీ రీఛార్జ్ తో 10 జీబీ డేటా పొందవచ్చు. న్యూ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వొడాఫోన్ కస్టమర్లు 4జీ డేటాను 1జీబీ రీచార్జ్ చేసుకుంటే అదనంగా 9జీబీ లభిస్తుందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. అలాగే, వొడాఫోన్ ప్లేలో టీవీ, మూవీస్, మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుందని ప్రకటించింది.

ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ అందుకోవాలంటే…న్యూ 4జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండాలి. పైగా గత ఆరు నెలల్లో దానిని వొడాఫోన్ నెట్‌వర్క్ కింద వాడి ఉండరాదు. 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లు వొడాఫోన్ సూపర్ నెట్ అనుభవాన్ని పొందేందుకు  ఈ ఆఫర్ ప్రోత్సాహకరంగా ఉంటుందని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ సందీప్ కటారియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వొడాఫోన్ తాను సొంతంగా 3జీ/4జీ సేవలు అందిస్తున్న సర్కిళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

మరోపక్క ఎయిర్టెల్ 4జీ వినియోగదారుల కోసం మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 4జీ నెట్ వాడని వారు తమ మొబైల్ నుండి 52122కి మిస్డ్ కాల్ చేస్తే రెండు రింగ్స్ తరువాత అదే ఆగిపోయి మన సెల్ కి 1జీబీ డేటా ఫ్రీ అని మెసేజ్ వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు 4జీ నెట్ వాడని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇప్పటికే మీరు 4నెట్ వాడుతుంటే ఈ ఆఫర్ వర్తించదు. అంతేకాక వచ్చిన ఈ డేటా కేవలం 4జీ నెట్ వర్క్ లో మాత్రమే పని చేస్తుంది. 3జీ, 2జీ సిగ్నల్ ఉంటే ఇది పనిచెయ్యదు. మన ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి 4జీ నెట్ వర్క్ మోడ్ ను సెలక్ట్ చేసుకోవాలి. నెట్ వర్క్ లో 4జీ లైట్ సింబల్ చూపిస్తున్నప్పుడు మాత్రమే 1జీబీ ఫ్రీ డేటా వాడుకోవడానికి అర్హులు. దీనికి 28 రోజుల కాలపరిమితి ఉంటుంది. మొత్తానికి జియో దెబ్బను తట్టుకోవడానికి, తమ కస్టమర్లను కాపాడుకోవడానికి వోడాఫోన్, ఎయిర్‌టెల్ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

Related posts:
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
స్థూపం కావాలి
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
నారా వారి నరకాసుర పాలన
పాత 500, 1000 నోట్లు మార్చుకోండి ఇలా
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
ఆ ఇంగ్లీష్‌తో పెట్టబడులు వస్తాయా?
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?

Comments

comments