కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Extreme situation with NTR political party

ఏపిలో ఇప్పటికే జనాలకు రాజకీయపరంగా ఓ క్లారిటీ ఉంది. ప్రస్తుతం ఏపిలో అధికారం తెలుగుదేశం దేశం పార్టీ చేతులో, ప్రతిపక్ష పార్టీగా వైసీపీ సెటిల్ అయిపోయాయని తెలుసు. కాగా తాజాగా ఏపికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తున్నాడు కాబట్టి ఆ పార్టీని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు. అయితే తాజాగా ఏపిలో మరో రాజకీయ పార్టీ వస్తోంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ పార్టీని ఎవరు స్థాపిస్తున్నారు అనేగా మీద అనుమానం. ఇంకెవరు తెలుగు సినిమా రంగంలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ అని వార్త.

తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, తన మిత్రుడి సలహా మేరకు ఓ పార్టీని స్థాపిస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని కాదని, బయటకు వచ్చి ఓ పొలిటికల్ పార్టీని స్థాపిస్తారు అని వార్తలు. ఒకవేళ ఎన్టీఆర్ గనక పార్టీని స్థాపిస్తే మాత్రం ఏపిలో రాజకీయ చిత్రం మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా తెలుగుదేశం పార్టీకి ఈ పరిణామం చాలా చేటు చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాలు ఏర్పడే అవకాశం కూడాలేకపోలేదు. తెలుగుదేశం ఓటు బ్యాంకు మీద ఎన్టీఆర్ పార్టీ ఖచ్చితంగా ప్రభావాన్ని చూపుతుంది.

ఇక తెలుగుదేశం కాకుండా మిగిలిన పార్టీల పరంగా చూస్తే… ప్రతిపక్ష పార్టీగా వైసీపీగా మంచి బలం ఉంది. కానీ ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే వైసీపీ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కు అయితే పోటీ తప్పదు. పవన్ కు ఎలాంటి సినిమా ఇమేజ్ ఉందో ఎన్టీఆర్ కూడా అదే ఇమేజ్ ఉంది. పైగా ఎన్టీఆర్ మంచి మాటకారి కావడంతో పొలిటికల్ గా ఎంతో ప్రభావంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన కాంగ్రెస్, వామపక్షాలు పెద్దగా ఈ పార్టీ వల్ల నష్టపోవడం అంటూ ఏమీ ఉండకపోవచ్చు. మొత్తానికి ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే మాత్రం అది ఖచ్చితంగా ఏపిలో రాజకీయాలను కుక్కలు చించిన విస్తరవుతుందని తెలుస్తోంది. కాగా అసలు ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎక్కడా కూడా అధికారిక వార్తలు లేవు. ఇది కేవలం గాలివార్తలు అని రాజకీయ సర్కిల్స్ లో అందరూ అనుకుంటున్నారు.

Related posts:
5రూపాయలకే భోజనం.. అన్న క్యాంటీన్.. వెనకున్నది ఒకరే
జగన్ ఆస్తుల విషయంలో బాబు ఎందుకు తగ్గుతున్నాడు...?
న్యూస్ ఛానల్సా..? న్యుసెన్స్ ఛానల్సా..??
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
పాక్ ను వద్దనుకున్నాడు కాశ్మీర్ రాజు కానీ..
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ఏపికి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య హీరోనా..? విలనా..?
బాబ్బాబు.. బాబ్బాబ్.. బాబూ
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
చంద్రుడి మాయ Diversion Master
టాప్ గేర్ లో ముద్రగడ
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
ఓటమి వైపే చంద్రబాబు అడుగులు
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
10 వేలకోట్ల రచ్చ - తిప్పి కొట్టిన జగన్ డిజిటల్ సేన
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
జగన్ క్రిస్టియన్ కాదా!

Comments

comments