కేసీఆర్ చెప్పిన కుట్రలో నిజమెంత…?

Facts on Telanagna CM KCR statements

తెలంగాణ సిఎం కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న తరుణంలో ఓ కుట్ర గురించి మాట్లాడారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు కలగకుండా చూశారని..టిడిపి, కాంగ్రెస్ నాయకుల మీద మండిపడ్డారు. ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించి..ఎంతో మంది త్యాగాల కారణంగా వచ్చిన తెలంగాణకు ఇంకా బొడ్డు కూడా కత్తిరించక ముందు నుండే కుట్రలకు తెర తీశారని మండిపడ్డారు. తన పార్టీ ఎన్నికల్లో విజయాన్ని నమోదు చేసుకున్నా కానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు కాకుండా చూడాలని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని టిడిపి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుట్రపన్నారు అన్న విషయం వెల్లడించడంతో దీనీ మీద చర్చకు తెర తీసినట్లైంది. అయితే ఆ టైంలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమకు ఈ కుట్ర గురించి చెప్పారని.. తమకు అండగా నిలిచారని కూడా అన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు అంటే..

* టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో వచ్చిన సీట్లు..63, ఎంఐఎంకు వచ్చింది 7 సీట్లు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేశారని అంటున్న టిడిపికి 20 సీట్లు(బిజెపితో కలిపి), కాంగ్రెస్ కు 21 సీట్లు ఉన్నాయి. మిగిలిన పార్టీలు 8సీట్లు సాధించాయి. మొత్తం కలిపితే 49 సీట్లు..అదే ప్రభుత్వ బలం(టిఆర్ఎస్+ఎంఐఎం)70సీట్లు. మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టిడిపికి, కాంగ్రెస్ పార్టీలకు ప్రభుత్వాన్ని పడగొట్టే కెపాసిటి ఎక్కడ ఉంది..?
* తెలంగాణలో ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని కూలదోయాలని అప్పుడు టిడిపి, కాంగ్రెస్ నాయకులు అంత బుద్దితక్కువ వారైతే కాదు.
* ముందు నుండి టిఆర్ఎస్‌తో పోటీపడిన ఎంఐఎం పార్టీ నాయకులతో టిఆర్ఎస్ నాయకులు మహమూద్ అలీ, హరీష్ రావు, ఈటెల రాజేందర్‌లు దారుస్సలాంలో పార్టీకి అండగా నిలిచి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని చర్చలకు పూనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఎంఐఎం పార్టీ నాయకులే కుట్రను చెప్పి.. మాకు మద్దతునిస్తామని అన్నారు.
* తెలంగాణలో రాష్ట్రపతి పాలనకు ఎన్నికల తర్వాత ఏర్పాట్లు జరుగుతున్నాయి అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఒక్క సాక్షం కూడా లేదు.
* నాడు తమ ప్రభుత్వాన్ని కూల్చాలని టిడిపి, కాంగ్రెస్ పార్టీలు, నాయకులు కుట్ర చేశారు అన్న కేసీఆర్.. అదే కాంగ్రెస్ లో నాడు ఉన్న నల్లొండ ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎమ్.పి వివేక్, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్ర కుమార్ లను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు?

Elections-Results

-Abhinavachary

Related posts:
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
మోదీ అంటేనే చిరాకుపడుతున్న ఆ గ్రామస్తులు.. ఎందుకంటే
తెలుగువాళ్లను వెర్రివెంగళప్పలను చేస్తున్నారే..?!
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
జగన్ గెస్ట్ యాక్టర్ అయితే మరి చంద్రబాబు..??
వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్టీఆర్ సినిమా సహాయం
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
బ్రీఫ్డ్‌మీ (నిన్నొదల)
టాప్ గేర్ లో ముద్రగడ
వెనకడుగు
ముంచింది కమ్యూనికేషన్ గ్యాపే
ప్రత్యేక హోదా పై కాంగ్రెస్ కూడా సై....!
పోలవరం దోపిడి.... చంద్రబాబు లీలకు ప్రత్యక్ష సాక్షం
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
ఆస్పత్రులే నరకానికి రహదారులు?
జగన్ క్రిస్టియన్ కాదా!
నోట్ల మీద బ్యాన్ తొలిసారి కాదు
పవన్ క్షమాపణలు చెప్పాలి
పైసలు వసూల్ కాలేదుగా..

Comments

comments