బ్రిటన్‌ను విడగొట్టింది నేనే

Finally Manchu Vishnu Completed Mission Brexit in London

ఓ దేశం విడిపోవాలను నిర్ణయించుకుంది.. ఎన్నో దేశాలు పరిణామాలు ఎలా ఉంటాయా అని ఆసక్తికరంగా ఎదురు చూశాయి. ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్లు దాదాపుగా నష్టాల బాట పట్టాయి. ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించిన ఆ ఘటన బ్రెగ్జిట్. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుండి విడిపోవాలా.. వద్దా అనే దానిపై నిర్వహించిన రెఫరెండంలో చివరకు విడిపోవాలని ఓటు వేసింది. అయితే ఈ మొత్తం మిషన్ కు మన తెలుగు హీరో హస్తం ఉంది. అతడు వచ్చిన పని పూర్తయిన తర్వాత కానీ అసలు మ్యాటర్ ఏంటో అనే దానిపై ట్వీట్ చేయలేదు. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఈయూ నుండి బ్రిటన్ ను సక్సెస్ ఫుల్ గా విడగొట్టాడు మన తెలుగు హీరో.

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. మన తెలుగు హీరో కారణంగానే బ్రిటన్ దేశం ఈయూ నుండి విడిపోయింది. అన్ని కోట్ల మంది వ్యతిరేకంగా ఓటు వేసి.. విడిపోవడానికి మొగ్గుచూపారు అంటే ఆ హీరో పుణ్యమే. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? మంచు వారి పుత్రరత్నం. మంచు విష్ణు. అక్షరాల నిజం ఇదే విషయాన్ని మంచు విష్ణు తన ట్విట్టర్ లో వెల్లడించారు. తాను వచ్చిన పని ముగిసిందని  ట్వీట్ చేశారు. పౌండ్ విలువ భారీగా పతనమైంది.. మరి ఇప్పుడు జేమ్స్ బాండ్ ఏం చేస్తాడో చూడాలి అని ట్వీటాడు.

అసలు మంచు విష్ణుకు, బ్రెగ్జిట్ కు ఏంటీ సంబందం అనుకుంటున్నారా.? ఏం సంబందం లేదు. బ్రెగ్జిట్ లో మంచు వారి చేతి వాటం ఏమీ లేదు. కానీ ట్రెండింగ్ సబ్జెక్ట్ మీద కాస్త డిఫరెంట్ గా ట్విట్టర్ లో స్పందించారు మంచు విష్ణు. 22వ తేదీన లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయింది. పౌండ్ విలువ భారీగా పతనం అయ్యింది. నా మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు 007 (జేమ్స్ బాండ్) ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ సరదాగా ట్వీట్ చేశాడు. మొత్తానికి మంచు వారు మంచి కళాపోషకులే అని నిరూపించుకున్నారు.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మోదీ.. రంగుపడిందా..? చంద్రబాబు రంగుపోయిందా..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
వీళ్లకు ఏమైంది..?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
ఆటలా..? యుద్ధమా..?
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
విమానంలో చక్కర్లు కాదు.. రైతులకు న్యాయం కావాలి
సౌదీలో యువరాజుకు ఉరి
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
కేవలం 500 రూపాయిల్లో పెళ్లి
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?
తిరిగిరాని లోకాలకు జయ
జయ మరణం ముందే తెలుసా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఒక్క రూపాయికే చీర

Comments

comments