తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు

FireEngines for Harithaharam

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారానికి మరింత ఊపును తీసుకువస్తున్నారు తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి. ఓ పక్క కేటీఆర్ స్వయంగా చాలా చోట్ల హరితహారం ప్రోగ్రామ్స్ లో పాలుపంచుకుంటూ.. మొక్కలను నాటండి అని చాటుతున్నారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం నిజంగా గొప్పదే అనుకోవాలి. ఇంతకీ ఏంటా నిర్ణయం అనుకుంటున్నారా..? హరితహారం కార్యక్రమంపై అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం బాగుందని ప్రశంసించిన ఆయన.. మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగవడం చాలా ముఖ్యమన్నారు.

మొక్కలను బతికించడానికి జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్లతో సమన్వయం కుదుర్చుకుని రాష్ట్ర వ్యాప్త కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లకు మెమో జారీ చేశారు సీఎస్. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలో కూడా ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు.. వాటికి నీళ్లు పోయడం, రక్షించడం కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. వారానికొకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు. మొక్కలకు నీళ్లు పోయడానికి అవసరమైతే జిల్లాలు, డివిజన్లలో అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజిన్లను మొక్కలకు నీరు పోయడానికి ఉపయోగించుకోవాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో ఉన్న మంచినీటి ట్యాంకర్లతో మొక్కలకు నీరు పోయాలని సూచించారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఆయనకు వంద మంది భార్యలు
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
బకరా మంత్రిని అనుకుంటున్నావా..? హరీష్ రావు ఆగ్రహం
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
దివీస్ పై జగన్ కన్నెర్ర
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
తిరిగిరాని లోకాలకు జయ
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments