పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా

Five Crore Prize Money to PV Sindhu from Telanagana

ఒలింపిక్స్‌లో రతజం నెగ్గిన తొలి భారత మహిళా రికార్డు సృష్టించిన హైదరాబాద్ షట్లర్ పివి సింధుకు నజరానాలు వెల్లువెత్తాయి. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమెకు బహుమతి రూపంలో కోట్లు ప్రకటించాయి. సింధుకు రూ.5 కోట్ల ప్రోత్సాహక బహుమతి, హైదరాబాద్ నగరంలో 1,000 గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు ఆమెకు ఇష్టమైతే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. కోచ్ పుల్లెల గోపీచంద్‌కు రూ. 1 కోటి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్‌కు రూ. 1 కోటి నజరానాను సిఎం ప్రకటించారు

రియోలో మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగు అమ్మాయి పివి సింధుపై ప్రశంసలే కాదు… కాసుల వర్షం కూడా కురుస్తోంది. రియోలో బ్యాడ్మింటన్ గేమ్ లో ఫైనల్ లో సిల్వర్ గెలిచిన పివి సింధుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అరకోటి(యాభై లక్షలు) ప్రకటించారు. అంతకు ముందు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌-ముంబై మాస్టర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వర్‌నాథ్‌ బిఎండబ్లు కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

తాజాగా దిల్లీ ప్రభత్వం కూడా సింధుకు నజరానాను ప్రకటించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింధుకు రెండో కోట్ల భారీ నజరానాను ప్రకటించారు.  భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది. సల్మాన్ కూడా రియోకు వెళ్లిన అధ్లెట్లకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ముందే ప్రకటించారు. మొత్తంగా సింధు మీద కాసుల వర్షం కురుస్తోంది.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
సైన్యం చేతికి టర్కీ
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
‘స్టే’ కావాలి..?
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
చంద్రబాబు చిన్న చూపు
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
అకౌంట్లో పదివేలు వస్తాయా?
మోదీ హీరో కాదా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
కాంగ్రెస్ నేత దారుణ హత్య
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments