డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్

Foreign tourusts dance for Indian rupees

దేశంలో పెద్దనోట్ల రద్దుతో మోదీ ఆర్థికంగా అన్ని వర్గాలను దెబ్బ తీశాడు. దాంతో దేశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. చాలా వరకు పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. కేంద్రం రెండున్నర లక్షల రూపాయలు పెళ్లి కోసం డ్రా చేసుకునే అవకాశం ఉన్నా కానీ అన్ని చోట్ల అది కుదరడం లేదు. దాంతో చాలా వరకు పెళ్లిళ్లు రద్దవుతున్నాయి. ఇక ఇంకోచోట కేవలం ఐదు వందల రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. ఇలా అద్భుతాలు జరుగుతున్న క్రమంలో విదేశీలు కూడా అందుకు బాధ్యులుగా నిలుస్తున్నారు. మోదీ పుణ్యమా అని మన దేశంలో విదేశీయులు రోడ్ల మీద డబ్బుల కోసం డ్యాన్సులు చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది.

నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారం భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన విదేశీయుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. రాజ‌స్థాన్ పుష్క‌ర జాత‌ర‌కు వ‌చ్చిన ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ ప‌ర్యాట‌కుల‌కు నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు పడుతున్నారు. త‌మ దేశాల‌కు తిరిగి వెళ్లాలంటే ఢిల్లీ నుంచి విమాన టికెట్లు ఉన్నాయి. కానీ స‌మ‌స్య ఇక్క‌డే ఉత్ప‌న్న‌మైంది. అక్క‌డ ప‌రిస‌రాల్లో ATMలు అన్ని మూత‌ప‌డ‌టం, బ్యాంకుల్లో డబ్బు లేకపోవటంతో.. వారి చేతిలో చిల్లి గ‌వ్వ‌లేదు. రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్లటానికి డబ్బు కోసం వినూత్నంగా ఆలోచించారు.

చివరకు డ‌బ్బుల కోసం దేశం కాని దేశంలో ఏదోదో చేస్తున్నారు. జైపూర్ లోని బ్ర‌హ్మ ఆల‌యం ఎదుట వారికొచ్చిన ఫీట్ల‌ను ప్ర‌ద‌ర్శించారు. మ‌గ‌వాళ్లు గిటార్ వాయించ‌గా ఆడ‌వాళ్లు నృత్యాలు చేశారు. ఇలా చేస్తూనే డ‌బ్బులు ఇచ్చి స‌హాయం చేయాల్సిందిగా స్థానికుల‌ను కోరారు. డ‌బ్బు క‌ష్టాలున్నాయి.. మాకు స‌హాయం చేయండి అంటూ ఫ్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. వారి శ్ర‌మ వృథా పోలేదు. స‌హృద‌యంతో స్పందించిన స్థానికులు విదేశీయుల‌కు త‌మ‌కు తోచినంతలో ఇచ్చారు.

రాజ‌స్థాన్ పుష్క‌ర జాత‌ర‌కు తాము న‌వంబ‌ర్ 8న వచ్చిన‌ట్లు విదేశీయులు తెలిపారు. ఆ రోజే పెద్ద నోట్లు ర‌ద్ద‌వ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్లు వివ‌రించారు. తెచ్చుకున్న డ‌బ్బంతా అయిపోవ‌డంతో ఢిల్లీకి వెళ్లేందుకు కూడా ఛార్జీలు లేవ‌న్నారు. క‌డుపు నిండా తిని రెండు రోజులైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ATM ద‌గ్గ‌ర క్యూలైన్లో నిల్చున్నా ఫ‌లితం ద‌క్క‌లేద‌ని చెప్పారు. త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌కు మెచ్చి స్థానికులు 2వేల 600 స‌హాయం చేశార‌ని పేర్కొన్నారు. దిల్లీకి వెళ్లగానే త‌మ దేశ రాయ‌బార కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించి స‌హాయం చేయాల్సిందిగా కోరుతామ‌ని ఫారిన్ టూరిస్టులు వెల్ల‌డించారు. మొత్తానికి మోదీ దెబ్బతో చివరకు విదేశీయులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
జెండా తెచ్చిన తిప్పలు
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
పెట్రోల్ లీటర్‌కు 250
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
బాబు బిత్తరపోవాల్సిందే..
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
భారత్‌కు స్విస్ అకౌంట్ల వివరాలు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
500 నోటుపై ఫోటో మార్చాలంట
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments