తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు

Four airports to two telugu states

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మూడు, తెలంగాణలో ఓ విమానాశ్రయానికి కేంద్రం అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లుకు సూత్రపాయ అంగీకారంతో పాటు తెలంగాణలోని కొత్తగూడెం ఎయిర్‌ పోర్టు సైట్‌ క్లియరెన్స్‌కు ఆమోదం తెలిపింది. తెలంగాణ జిల్లాల్లో కీలకమైన ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో కేంద్రం ఎయిర్ పోర్ట్ కు అనుమతించింది. కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ వల్ల ఇటు పాల్వంచ, కొత్తగూడెం, అటు భద్రాచలానికి రవాణా మెరుగుపడుతుంది. తాజాగా తెలంగాణ సర్కార్ కొత్తగూడెంను జిల్లా కూడా చేసింది.

విజయనగరం జిల్లాలోని భోగాపురంలో 2,200 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పిపిపి) పద్ధతిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏపి ప్రభుత్వం నిర్మించనుంది. నెల్లూరులోని దగదర్తి విమానాశ్రయాన్ని పిపిపి పద్ధతిలో, కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనుంది. ఈ రెండు విమానాశ్రయాలను ఒక్కొక్కటి రూ.88 కోట్లతో నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెంలో ఎంపిక చేసిన స్థలానికి కేంద్రం ఆమోదించింది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
పెట్రోల్ లీటర్‌కు 250
సల్మాన్ ఖాన్ నిర్దోషి
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
సౌదీలో యువరాజుకు ఉరి
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
అమెరికా ఏమంటోంది?
మోదీ హీరో కాదా?
అమ్మ పరిస్థితి ఏంటి?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
బంగారం బట్టబయలు చేస్తారా?
బ్యాంకోళ్ల బలి.. సినిమా కాదు రియల్
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
పాపం.. బాబుగారు వినడంలేదా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments