నాలుగేళ్లకే బ్యాట్ పట్టిన బుడ్డోడు(వీడియో)

Kid, Cricket, Shayan Jamal, Delhi, Sachin

Four years kid smashing ground with his circket bat. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People.

సాధారణంగా నాలుగేళ్ల చిన్నారులు కనీసం వారి పనులు వారే సక్రమంగా చేసుకోలేరు. కానీ, ఢిల్లీకి చెందిన షాయన్ జమాల్ మాత్రం నాలుగేళ్లకే సచిన్‌లాద్రావిడ్‌లా డిఫెన్స్.. స్ట్రైట్ డ్రైవ్‌లు.. ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అంతే కాదు అండర్-12 స్కూల్ టీమ్‌కు ఎంపికై రికార్డు కూడా సృష్టించాడు. టివిల్లో ప్రసారమయ్యే క్రికెట్ మ్యాచ్‌ల స్ఫూర్తితో మూడేళ్లకే క్రికెట్ బ్యాట్ పట్టిన జమాల్ ఏడాది తిరిగే సరికి అండర్-12 స్కూల్ టీమ్‌కు ఎంపికయ్యాడు. నాలుగేళ్ల వయసు చిన్నారులు కనీసం బ్యాట్ పట్టుకోవడానికి కూడా ఇబ్బందిపడుతారు.

కానీ జమాల్ మాత్రం అద్భుత టెక్నిక్‌తో స్ట్రైట్‌డ్రైవ్, కవర్ డ్రైవ్‌లు ఆడుతూ అబ్బురపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఆఫ్ స్టంప్ బంతులు ఆడడంలో తడబడుతుంటే ఈ బుడ్డోడు మాత్రం అవుట్‌సైడ్ ఆఫ్‌స్టంప్ బంతులను తెలివిగా ఎదుర్కొవడం గమానార్హం. అన్నట్లు తాను కూడా విరాట్ కోహ్లిలా ఏదో ఒకరోజు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తానని చెబుతున్నాడు ఈ బుడ్డోడు.షాయన్ తండ్రి క్లబ్ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. అతడి శిక్షణలోనే షాయన్ జమల్ క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఈ బుడ్డోడికి క్రికెట్ కోచ్ ఉత్తమ్ భట్టాచార్య శిక్షణ కూడా తోడైంది. ఆయన శిష్యరికంలో షాయన్ తన ప్రతిభకు పదును పెట్టుకుంటున్నాడు. నాలుగేళ్ల వయసులోనే ఈ పిల్లాడు ఇంతటి ప్రతిభ కనబర్చడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులో క్రికెట్ ఆడుతున్నాడు షాయన్‌.

Related posts:
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
ఆట ఆడలేమా..?
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
స్థూపం కావాలి
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
ఏపీకి ఆ అర్హత లేదా?
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments