40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?

Fourty years Difference between Jagan and Chandrababu naidu

నలభైఏళ్లు.. నాలుగు దశాబ్దాలు.. అంటే మామూలు టైం కాదు. ఓ తరం అనుభవం. కానీ ఇక్కడ నలభై ఏళ్ల ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. తెలుగు రాష్ట్రాల్లో ఏపి విభజన కారణంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎన్నికల్లో మోదీ సర్కార్ తో దోస్తీ చేసుకున్న కారణంగా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ప్రచారం చెయ్యడం మూలాన చంద్రబాబు నాయుడు సర్కార్ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా(రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి, ప్రస్తుతం విభజిత ఏపికి) అనుభవం గడించారు.

ఏపిలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాడు వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుగా వచ్చినా కానీ తన మార్క్ వేస్తూ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడుకు నిలువునా నిలదీస్తున్నారు. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు కన్నా వైయస్ జగన్ చాలా చిన్నవాడు.

ఇద్దరి మధ్యన 40 ఏళ్ల అనుబంధం ఉంది. అదేంటి జగన్ వయస్సు నలభై ఉంటుంది మరి అలాంటిది చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య నలభై ఏళ్ల అనుబంధం ఎలా కుదిరింది అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ నలభై ఏళ్ల ఇద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. నారా చంద్రబాబు నాయుడుకు నలభై ఏళ్ల అనుభవం ఉంది. కానీ వైయస్ జగన్ వయస్సే నలభై ఉంటుంది. మరి అలాంటి ఇద్దరి చాలా తేడా ఉంది. ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు తప్పుమీద తప్పు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు. ఏపి ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారు.

ఏపికి ప్రత్యేక హోదా విషయాన్ని వదిలి  నారా చంద్రబాబు నాయుడు కేంద్రం ముందు మోకరిల్లారు. ఏపికి ప్రత్యేక హోదా రాకున్నా, దాని గురించి పెద్దగా పట్టించుకోని వైనం చంద్రబాబు నాయుడు. కానీ ఏపి ప్రజల భవిష్యత్తు కేవలం ప్రత్యేక హోదా మీద మాత్రమే ఆధారపడింది అని దాన్ని సాధించడమే తన లక్ష్యంగా వైయస్ జగన్ అకుంఠిత పట్టుదలను ప్రదర్శిస్తున్నాడు. నాడు సోనియాగాంధీని ఎదురించిన జగన్ ఇప్పుడు ఏపి ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర సర్కార్ ను కూడా ఎదురిస్తున్నారు.

కాల్ మనీ, ఓటుకు నోటులాంటి ఎన్నో అంశాల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేశారు. కానీ స్వప్రయోజనాలను పక్కనబెట్టి వైయస్ జగన్ కేవలం ప్రజలకు మేలుచెయ్యాలనే ఉద్దేశంతోనే పోరాడుతన్నారు. తన కుటుంబ సభ్యుల కోసం చంద్రబాబు నాయుడు అన్ని అంశాల్లో కాంప్రమైజ్ అవుతున్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు ఎవరితోనైనా యుద్ధం చేసే నైజం జగన్ ది.

పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని చేపట్టిన అనుభవం చంద్రబాబు నాయుడు సొంతం. నమ్మిన వారి కోసం తల తెగే వరకు పోరాడేతత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ల అనుభవం అంతా కేవలం కుట్రలు, కుతంత్రాలు, మీడియా మేనేజ్ మెంట్, అక్రమ ఆస్తులు, కోర్టు స్టేలు, విదేశీ పర్యటనలు, నమ్మిన వారిని నట్టేట ముంచిన ఘటనలే కనిపిస్తాయి. తన మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా కానీ నవ్వుతూ బయటకు వచ్చి, ప్రజల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న నాయకుడు వైయస్ జగన్.

నాన్న గారి ఫోటోతో పాటు ప్రతి ఇంట్లో తన ఫోటో కూడా ఉండేలా చేస్తానన్న వైయస్ జగన్ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. ఉండేది నలభై ఏళ్లా, నాలుగు రోజులా అనేది ముఖ్యం కాదు.. నాలుగు కాలాల పాటు గొప్పగా చెప్పుకునేలా చెయ్యడంలో జీవితం సార్థకత ఉంది. కానీ ఏపి ప్రజల విషయంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ దారి ఆయన మనసులేనేలేదు. అందుకే తన అధికారాన్ని కాపాడుకోవడానికి అడ్డమైన దారులను వెతుకుతున్నారు.

Related posts:
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
ఆ అద్భుతానికి పాతికేళ్లు
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
we report you decide అంటున్న శేఖర్ బాషా- ఆంధ్రజ్యోతి గాలి తీశాడు
పవన్ చంద్రుడి చక్రమే
చంద్రుడి మాయ Diversion Master
టాప్ గేర్ లో ముద్రగడ
బాబు Khan
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)
హోదా పోరాటం.. జగన్ పట్టాలెక్కింది
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
ఏపికి ప్రత్యేక హోదా ఓ సంజీవని
పాక్‌కు పోయేదేముంది.. భారత్‌కు వచ్చేదేముంది ?
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
ఏం పీకలేకపోతున్నారు... ఎందుకు ఇలా?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ఎన్నికల్లో ఓ పాచికా?
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
జయలలిత జీవిత విశేషాలు
క్యాష్‌లెస్ ఇండియా ఎప్పటికీ కలే

Comments

comments