1075కు ఫోన్ చేస్తే ఫ్రీగా డాక్టర్ల సలహాలు

Free doctors suggestions on 1075 toll free

ఏ దేశం అయినా విద్య, వైద్యరంగంలో ముందుంది అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి చెందినట్లే లెక్క. భారత్ లాంటి దేశాలు ఇలాంటి వ్యవస్థాగత అంశాలను గాలికి వదిలెయ్యడం వల్లే మనం ఇంకా ఇలానే ఉన్నాం. కాగా ప్రభుత్వాలు మారుతున్న కొద్ది పరిస్థితుల్లో కొద్దికొద్దిగా మార్పులు వస్తున్నాయి. తాజాగా వైద్య రంగంలో మరోఅడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రజలకు ఫోన్ ద్వారా వైద్యుల సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా 1075 నెంబరుతో ఫోన్ సౌకర్యాన్ని కలిగించనుంది. హిందీ,ఆంగ్లం, తెలుగు సహా 23 ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలకు ఫోన్ ద్వారా వైద్యుల సేవలు అందించడానికి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తారు. చిన్నచిన్న వ్యాధుల నివారణకే ఈ సేవలు పరిమితం చేయనున్నారు. 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రిజిస్టరైన వైద్యులు సలహాలు ఇస్తారు.  తొలుత కేంద్ర కాల్ సెంటర్ లో 300 సీట్లు ఉంటాయి. మూడేళ్ళలో వాటి సంఖ్యను 800లకు పెంచుతారు. మొదటి దశలో డాక్టరు చీటీ అవసరం లేకుండా కొనుగోలు చేయదగ్గ మందుల పేర్లనే సెల్ ఫోన్ కు పంపిస్తారు.ఆ తరువాత చీటీ రూపంలో పంపిస్తారు. వీటిని ఈ మెయిల్ రూపంలో కూడా పంపించే వీలుంది. తొలుత పేర్లు నమోదు చేసుకున్న 500 మంది వైద్యులు సేవలు అందిస్తారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ రెండు వారాల్లో టెండర్లు ఆహ్వానిస్తుంది. అలాగే మద్యం, పొగాకు వంటి దురలవాట్లు మాన్పించడంపైనా సలహాలు ఇవ్వడానికి కూడా కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
పోరాటం అహంకారం మీదే
హైదరాబాద్ లో వానొస్తే.. కేటీఆర్ కు వణుకొస్తుంది
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
ఈసారి ఆ తప్పుకు తావివ్వకూడదు

Comments

comments