ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య

Free wifi in Kerala Schools

ఇండియాను డిజిటల్ ఇండియాగా మార్చేందుకు మోదీ కంకణం కట్టుకున్నారు. కాగా తాజాగా కేరళ రాష్ట్రం ఆ దిశగా తీసుకున్న నిర్ణయం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే దేశ అక్షరాస్యత శాతంలో టాప్ లో కొనసాగుతున్న కేరళ, ఈ-అక్షరాస్యతలోనూ టాప్ లో దూసుకెళుతోంది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యావ్యవస్థను కూడా డిజిటలైజేషన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అలా కేవలం నిర్ణయం వరకు మాత్రమే కాకుండా కార్యాచరణకు కూడా ముందుకు వచ్చింది. అందులో భాగంగా వచ్చే నెల 1వ తేదీ నుండే కొత్త ఆలోచనకు అంకురార్పణ చెయ్యనుంది.

కేరళ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను డిజిటలైజేషన్ చేసేందుకు ఆ రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 10వేల గవర్నమెంట్ స్కూళ్ల లో త్వరలోనే ఫ్రీ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్   సాయంతో కేరళ స్కూళ్లను వైఫైతో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేపట్టింది. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదన జరుపుకుంటారు. అదే రోజు నుండి ఈ ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.దీంతో నవంబర్ 1వ తేదీ నుండి విద్యార్థులందరికి 2 ఎంబీపీఎస్ స్పీడ్ తో ఉచితంగా వైఫై లభిస్తుంది.

పదేళ్ల క్రితమే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనీ అందించే కార్యక్రమం ప్రారంభమైంది.  ఇందులో భాగంగా 5వేల స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించారు అధికారులు. అది విజయవంతం కూడా అయింది. దాని స్ఫూర్తితోనే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విధానాన్ని రూపొందించారు. చిన్న తరగతుల నుండే విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసేందుకు చర్యలు చేపట్టారు.

Related posts:
ఇదో విడ్డూరం
అతడికి గూగుల్ అంటే కోపం
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
స్థూపం కావాలి
అంత దైర్యం ఎక్కడిది..?
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
సదావర్తి సత్రం షాకిచ్చింది
బతుకు బస్టాండ్ అంటే ఇదే
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
బెంగళూరుకు భంగపాటే
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
అమ్మ పరిస్థితి ఏంటి?
అమ్మను పంపించేశారా?

Comments

comments