251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే

Freedom 251 Mobile ready for delivery

కొన్నాళ్ల క్రితం దేశం మొత్తం వినిపించిన పేరు ఫ్రీడమ్ 251. దేశంలోనే అతి చవకైన ఫోన్ ను అందించేందుకు రింగింగ్ బెల్స్ కంపెనీ ఫ్రీడమ్ 251 ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది.  ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి తొలివిడతగా ఐదు వేల ఫోన్లను డెలివరి చెయ్యడానికి సిద్దం చేసినట్లు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ మోహిత్ గోయెల్ ప్రకటించారు.  251 ఫోన్ ధరతో పాటు 40 రూపాయల డెలివరి ఛార్జీతో ఫోన్ ను తీసుకోవచ్చని అంటున్నారు. రెండు లక్షల ఫోన్ లను అందించడానికి తాము సిద్దంగా ఉన్నామని.. కానీ ప్రభుత్వం తమకు సహాయం చెయ్యాలని రింగింగ్ బెల్స్ డైరెక్టర్ వెల్లడించారు.

ఫ్రీడం 251 ఫోన్ ల కోసం 7 కోట్ల మంది రిజిస్టర్‌ చేసుకోగా.. అందులో రెండు లక్షల మందికి మాత్రమే ఫోన్లను డెలివరీ చేయనున్నారు. లాటరీ ద్వారా కస్టమర్లను ఎంపిక చేయనున్నట్టు రింగింగ్ బెల్స్ డైరెక్టర్ గోయెల్‌ తెలిపారు. ఒక్కో ఫ్రీడమ్‌ ఫోన్‌పై తమకు 930 రూపాయల నష్టం వస్తుందని, అసలు ఈ ఫోన్‌ వ్యయం 1,180 రూపాయల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. యాప్స్‌ ద్వారా 300 రూపాయలు పొందినా ఇంకా 630 రూపాయల నష్టం వస్తుందని తెలిపారు.

దేశంలోనే అతి చవక ఫోన్ అను అందిస్తున్న రింగింగ్ బెల్స్ తమ కంపెనీకి వచ్చే లాభాల్లో 95శాతం విరాళంగా ఇస్తామని ప్రకటించింది. ముందుగా చెప్పినట్లు ఫ్రీడం ఫోన్ లను తప్ప.. మిగిలిన ఫోన్ లను కొంత లాభం చూసుకొనే అమ్ముతామని అన్నారు. ఎల్‌ఇడి టీవీలో 10-15 శాతం మార్జిన్‌ ఉందని తెలిపారు. కాగా కంపెనీ ప్రదర్శించిన ఫ్రీడమ్‌ 251 మొబైల్‌లో 1 జిబి రామ్‌, 8 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 3.2 మెగాపిక్సెల్‌ కెమెరా, 0.3 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, 1.3 గిగాహెట్జ్‌ ప్రాసెసర్‌, 1,450 ఎంఎహెచ్‌ బ్యాటరీ, డ్యూయల్‌ సిమ్‌ స్లాట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. నిన్నటి దాకా అందని ద్రాక్షలా ఉన్న ఫ్రీడం 251 ఎప్పుడు జనాలకు చేరి ఆనందాన్ని పంచుతుందో చూడాలి.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
క్రికెట్ చరిత్రలో జూన్ 25 చాలా స్పెషల్
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
సింగ్ ఈజ్ కింగ్
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
వీళ్లకు ఏమైంది..?
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్
తెలంగాణకు ప్రత్యేక అండ
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
ఆ సిఎంను చూడు బాబు...
నారా వారి నరకాసుర పాలన
బాకీలను రద్దు చేసిన SBI
తెలంగాణ 3300 కోట్లు పాయె
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
తిరిగిరాని లోకాలకు జయ
జయ మరణం ముందే తెలుసా?

Comments

comments