ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది

French-gymnast-Samir-Ait

ఒలింపిక్స్లో పతకం సాధించడమనేది ప్రతీ క్రీడాకారుడి కల. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఒలింపిక్స్కు అర్హత సాధించడం ఒక ఎత్తైతే, అక్కడ సత్తా చాటడం మరొక ఎత్తు. అందులోనూ జిమ్నాస్టిక్స్ అంటే మరింత కఠినమైన సాధన చేయాల్సి ఉంటుంది. తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నంలో జిమ్నాస్ట్లు గాయాలు బారిన పడటం అధికంగానే జరుగుతూ ఉంటుంది. తాజాగా ఈ తరహా ఘటనే రియో ఒలింపిక్స్ లో చోటు చేసుకుంది. ఓ ఫ్రెంచ్ జిమ్నాస్ట్ ఫీట్ చేసే క్రమంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు.

పురుషుల క్వాలిఫయింగ్లో భాగంగా నిర్వహించిన వాల్ట్ జిమ్నాస్టిక్స్ లో సమిర్ ఎయిట్ సెడ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను బ్యాక్ ఫ్లిప్స్ను పూర్తి చేసే క్రమంలో గాలిలోకి ఎగిరి అదుపు తప్పి నేలపై పడ్డాడు. దీంతో విలవిల్లాడిపోయిన సమిర్ను ప్రాథమిక చికిత్స చేసిన తరువాత స్ట్రైచర్ పై ఆస్పత్రికి తరలించారు. సమిర్ కిందకు పడేటప్పుడు కాలిపిక్కలోని ప్రధాన ఎముక తీవ్రంగా ఫ్రాక్చరైనట్లు డాక్టర్లు ధృవీకరించడంతో అతని ఒలింపిక్స్ కల ముగిసింది. అయితే ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న సమిర్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
మూడో టెస్ట్ లో మనదే విజయం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments