అప్పుడు బ్రిటిష్ ఇప్పుడు టెర్రరిజం.. గాంధీ-బోస్ మళ్లీ పుట్టాలా?

Gandhi and Bose have to Reborn to fight aganist terrorism

రవి అస్తమించని రాజ్యాన్ని స్థాపించారు నాడు బ్రిటిష్ పాలకులు. ప్రపంచంలో దాదాపుగా నాలుగు వంతుల భూమిని వారు ఆక్రమించి, పరిపాలించారు. అలాంటి బ్రిటిష్ సామ్రాజ్య బానిస సంకిళ్లకు ఎన్నో దేశాలు బంధీలుగా ఉండేవి. ఇప్పుడు ప్రపంచంలో పెద్దన్నగా చెప్పుకునే అమెరికా దగ్గరి నుండి అభివృద్ధిలో దూసుకెళుతున్న మన దేశాన్ని కూడా వారు తమ హస్తగతం చేసుకున్నారు. అయితే నాటి బానిస సంకెళ్లను తెంచడానికి ఎంతో మంది కష్టపడ్డారు. బ్రిటిష్ వారి కబంద హస్తాల నుండి భరతమాతకు స్వేచ్ఛను కల్పించడానికి, అఖండ భరతావని స్వేచ్ఛా వాయువులు తీసుకోవడానికి ఎంతో మంది త్యాగాలు చేశారు.

భారతదేశంలో ఎంతో చేస్తున్న ఉద్యమానికి అహింసా బలాన్ని జోడించి.. తెల్లవారికి కంటిమీద కునుకులేకుండా చేశాడు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో ఆయన చేసిన పోరాటం ఎంతో మందిలో ఉత్సాహాన్ని నింపింది. జాతిని ఒక్కతాటి మీదకు తీసుకువచ్చింది. అహింసా మార్గంలో తెల్లవారిని దేశం వదిలివెళ్లేలా చేసింది. అంతకు ముందు ఎన్నో సార్లు ఎన్నోసార్లు, తెల్లవారి మీద పోరాటాలు చేసినా గాంధీ ఎంచుకున్న అహింసామార్గం ఎంతో బలమైనది కావడంతో బ్రిటిష్ వారు తోకముడవక తప్పలేదు.

గాంధీ సిద్ధాంతాల సంగతి పక్కన పెడితే కేవలం హింసామార్గంలో మాత్రం మనకు స్వతంత్రం సిద్ధిస్తుంది అని బలంగా నమ్మిన నాయకుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. బ్రిటిష్ వారికి భారతీయుడి దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాడు బోస్. బ్రిటిష్ వాళ్లను వెళ్లమంటే వెళ్లరని, వాళ్లను బలవంతంగా వెళ్లగొట్టాల్సిందే అని బోస్ బలంగా నమ్మేవాడు. అందుకే బ్రిటిష్ కు వ్యతిరేకంగా బలాన్ని పెంచుకుంటూ వారిపై దాడులకు పాల్పడేవాడు. అలా గాంధీ చేస్తున్న పోరాటానికి పూర్తి భిన్నంగా ప్రతిదాడి చేశారు.  ఇప్పుడు నాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి బదులు ఉగ్రవాదం జడలువిచ్చుకు కూర్చుంది.

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉగ్రవాదం తన విశృంకలత్వాన్ని పెనవేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాల దగ్గరి నుండి అభివృద్ధి చెందని దేశాల వరకు అన్నింటిలో కామన్ గా ఉన్న రక్కసి ఉగ్రవాదం. ఇప్పుడు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఉగ్రవాద కట్టడికి సమయం ఆసన్నమైంది. తమ భద్రతకు, అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రతి దేశం కోరుకుంటోంది. అందుకే మరోసారి గాంధీ – బోస్ లు రావాలా..? అనే ప్రశ్న ఉద్భవించింది. నిజానికి నరరూప రాక్షసులుగా మారిన ఉగ్రవాదులను ఎదురించాలి అంటే హింసా – అహింసా మార్గాలు కావాలి.

గాంధేయ మార్గంలో ఉగ్రవాదానికి చరమగీతం పాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతటి బలవంతుడినైనా గానీ అహింసామార్గంలో ఓడించవచ్చు అని నిరూపించిన నాటి గాంధేయ మార్గంలోనే ఉగ్రవాదానికి ముగింపు గేయం పాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కోట్ల మంది అమాయకుల ఉసురుతీస్తున్న ఉగ్రవాదులను అహింసామార్గంలో ఓడించాలి అంటే మరోసారి గాంధీ పుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గాంధేయ మార్గంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అంటే అన్ని రకాలుగా డౌట్.. అందుకే మరోసారి కంటికి కంటిని తీసెయ్యాల్సిన అవసరం ఉంది. రక్తపాతం చేసైనా సరే శాంతిని సాధించాలి అన్నది బోస్ నమ్మిన మార్గం. మొత్తంగా టెర్రరిజాన్ని అంతమొందించడానికి గాంధీ-బోస్ లు మళ్లీపుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related posts:
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
పివి నరసింహారావు.. దేశానికి ఠీవి కాంగ్రెస్ కు బిపి
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఆ అద్భుతానికి పాతికేళ్లు
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
జగన్ బ్రహ్మాస్త్రం గడప గపడకు
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
సింధూరంలో రాజకీయం
అడకత్తెరలో కేసీఆర్
పవన్ ను కదిలించిన వినోద్
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
రైలు వచ్చె.. బడ్జెట్ పాయె ఢాం ఢాం ఢాం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
చెత్త టీంతో చంద్రబాబు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి... కేసీఆర్ సర్కార్‌కు సూచన
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు

Comments

comments