కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్

Nayeem-crores

పదుల సంఖ్యలో మర్డర్లు.. వేల సంఖ్యలో సెటిల్ మెంట్లు.. కోట్ల రూపాయల అక్రమాస్తులు ఇవి.. తెలంగాణలో మొన్నటి దాకా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ గా పేరుతెచ్చుకున్న నయీం గురించిన పరిచయం. మావోయిస్టు నుండి గ్యాంగ్ స్టర్ గా చివరకు.. అదే ఆయుధంతో చచ్చాడు. తెలంగాణలో ఎంతో కాలంగా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ లిస్ట్ లో ఉన్న నయీంను మొత్తానికి పోలీసులు ఎన్ కౌంటర్ లో వేసేశారు. నయీం చనిపోయిన వెంటనే అతడి, అతడి వాళ్లకు సంబందించిన అన్ని చోట్ల పోలీసులు దాడులు నిర్వహించారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలను నయీం కూడబెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కోట్లు కొద్దీ నగదు, కిలోల కొద్దీ బంగారం, వందల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని సమాచారం. నయీంకు ముంబై, పుణేల్లో వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో హైవే పక్కన విలువైన భూములున్నాయి. నార్సింగ్‌లో అరకోటి ఇల్లు అతడి చిన్నమ్మ కుమారుడి భార్య పేరిట ఉంది. ఈ ఇంట్లో రూ.30 కోట్ల విలువ చేసే భూములకు సంబందించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్‌ మండలం నెక్నాపూర్‌ గ్రామంలో కళ్లు చెదిరే రీతిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నాడని తెలుస్తోంది. ఈ ఇంటి చుట్టూ రక్షణ కవచంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశాడు.

కోట్ల రూపాయల నగదు, ల్యాండ్ డాక్యూమెంట్లతో పాటు అత్యాధునిక మారణాయుధాలు సైతం నయీమ్ స్థావరాలు, అతడి అనుచరుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాటిని కూడా సీజ్ చేయడానికి త్వరలోనే ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధమవుతున్నాయి. బిల్డర్లను, బడా వ్యాపారులను, పొలిటికల్ లీడర్లను బెదిరించి కూడగట్టిన సొమ్ము దాదాపుగా నాలుగు వేల కోట్లు ఉంటుంది అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా ఎన్ కౌంటర్ కూడా ఓ సెటిల్ మెంట్ జరిగే టైంలో జరిగింది అని పోలీసులు నిర్దారించారు.

Related posts:
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
తెలంగాణకు ప్రత్యేక అండ
తట్టుకోలేకపోతున్న పాకిస్థాన్..... భారత్ దెబ్బకు ఒక్కిరిబిక్కిరి
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
BSNL లాభం ఎంతో తెలుసా?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి నేతల క్యు
వార్దాకు వణికిపోతున్న చెన్నై
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఛాయ్‌వాలా@400కోట్లు
పాపం.. బాబుగారు వినడంలేదా?
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్

Comments

comments