పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు

Garikapati on Pawan Kalyana and Allu Arjun songs

ఈ మధ్య తెలుగు సినిమాల్లో సాహిత్యం కరువైంది అని విమర్శలు ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా మన తెలుగు పాటలు రాసే వాళ్లు మరీ దారుణంగా రాస్తున్నారు అని విసుర్లు చాలా వినిపిస్తున్నాయి. అలాంటి పాటలపై ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మిక గురువు గరికపాటి వేసిన చమత్కాలు అందరికి నవ్వులు తెప్పించాయి. అది కూడా తెలుగులో స్టార్ హీరోలుగా ఎదిగిన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల మీద వెయ్యడం వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ చేసిన గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ చేసిన బన్నీ సినిమాలోని పాటలపై ఆయన చమత్కరించారు.

గబ్బర్ సింగ్ లో ఏం చక్కని మందారం.. ఎనిమిది దిక్కుల సింగారం అనే పాటపై ప్రశంసలు కురిపించారు. చక్కటి తెలుగును ఆ రచయిత రాసిన విధానాన్ని ఆయన పొగిడారు. అయితే అదే రచయిత రాసిన మరోపాటపై మాత్రం విమర్శ కురిపించారు.  ‘‘బన్నీ, బన్నీ, బన్నీ, బన్నీ… నిన్ను చూస్తే జారుతుంది చున్నీ… అన్ని కాదు.. అందుకోరా కొన్ని అల్లుడెప్పుడు అవుతావని అడుగుతుంది పిన్నీ’’ అనే పాటపై గరికపాటి చమత్కారాలు చేశారు. జారుతోంది చున్నీ వరక కవిత్వమే కానీ అల్లుడెప్పుడవుతాడు అని అడుగుతోంది పిన్ని అనే దానిపై కామెంట్ చేశాడు. పిన్నికి ఎందుకు తొందర.. ఆమెకు పెళ్లైందిగా.. మరి ఎందుకు ఈ తొందర అంటూ చమత్కరించాడు. గతంలో పైట జారితే వేల పాటలు రాశారని.. మొన్నటి వరకు చున్నీ జారితే కూడా పాటలు రాశారని ఇప్పుడు ఇక జారడానికి ఏమీలేదు అంటూ నవ్వులు పూయించారు. కొన్ని దేశాల వారు మొత్తం దాచుకోవడమే సంస్కృతి అనుకుంటారు… కొన్ని దేశాల్లో అసలేమీ దాచుకోకపోవడమే సంస్కృతి అనుకుంటారు… హిందూ సంస్కృతి అలాంటిది కాదనీ, ఏది దాచుకోవాలో, ఏది తెరిచి చూపించాలో తెలిసిన విచక్షణ కలిగినదని ఆయన చెప్పిన తీరు ప్రశంసనీయం.

మీరూ ఆ వీడియో చూడండి:

Related posts:
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఉగ్రవాదుల టార్గెట్ హైదరాబాద్ ఎందుకు..?
పూలు అమ్మిన చోట కట్టెలు కూడా అమ్మలేక
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
టైం కోసం ఎదురుచూస్తున్న పవన్?
మెగా ఫ్యామిలీ పొలిటికల్ స్కెచ్
పవన్ చంద్రుడి చక్రమే
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ప్రత్యేక హోదా అసలు తేడా ఎక్కడ వచ్చింది?
కర్ణాటక, తమిలనాడుల మధ్య కావేరీ వివాదం
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
అక్కడి మీడియా ఇలా మొరుగుతోంది
తొక్కితే తాటతీస్తారు
కేవలం 57 సీట్లు మాత్రమే ఎందుకు?
57లో 20.. పాపం వారి పరిస్థితి ఏంటో?
బాబును ఉతికిఆరేశారు... కర్నూల్‌లో జగన్ ‘చెల్లెళ్లు’
పిట్టల దొరను మించిన మాటల దొర
జగన్ క్రిస్టియన్ కాదా!
పవన్ క్షమాపణలు చెప్పాలి
మోదీని వేధిస్తున్న ఏటీఎం కష్టాలు
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments