కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి

Get Discounts on Digital payments

కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత అందరూ కూడా డిజిటల్ పేమెంట్స్ వైపు మళ్లాలని పిలుపునిచ్చింది. అయితే పెద్దగా అవగాహనలేకపోవడం, అవసరమున్నా వాటిని పట్టించుకోకపోవండతో పరిస్థితిలో ఎలాంటి మార్పురాలేదు. అయితే దీన్ని గమనించిన సర్కార్ తాజాగా డిజిటల్ పేమెంట్లకు డిస్కౌంట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ రైల్వే టికెట్ల కొనుగోలు టోల్ట్యాక్స్ లాంటి వాటిని డిజిటల్ రూపంలో చెల్లిస్తే వాటిమీద తగ్గింపు ఉంటుందని ఆర్థికమంత్రి జైట్లీ వెల్లడించారు. పెట్రోల్/డీజిల్ రైల్వేటికెట్లతో పాటు ప్రభుత్వరంగసంస్థలకు చెందిన బీమా పాలసీల కొనుగోళ్లకు డెబిట్ క్రెడిట్ కార్డులను లేదా ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తే కొంతమొత్తం ఆదా అవుతుంది. కార్డుల ద్వారా 2000 వరకూ జరిపే చెల్లింపులపై సేవాపన్నును కూడా కేంద్రం తొలగించింది. ఈ వివరాల్ని ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ వెల్లడించారు.

పెట్రోల్ డీజిల్ కొనుగోలు మీద 0.75 శాతం తగ్గింపు ఉంటుందన్నారు. దీనిప్రకారం.. ఢిల్లీలో 66.10రూపాయలు ఉన్న లీటరు పెట్రోల్ మీద 49 పైసల చొప్పున డిస్కౌంట్ లభిస్తుంది. రూ.54.57 ఉన్న లీటరు డీజిల్ మీద 41 పైసల చొప్పున ఆదా అవుతుంది. ఎల్ఐసీ లాంటి ప్రభుత్వరంగ బీమాసంస్థలు కొత్త బీమా పాలసీల కొనుగోలు పాత పాలసీల ప్రీమియం చెల్లింపును ఆన్లైన్ డిజిటల్ పద్ధతుల్లో జరిపితే డిస్కౌంట్ ఇస్తాయి. డిస్కౌంట్ల భారాన్ని ఆయా ప్రభుత్వ విభాగాలే భరిస్తాయని జైట్లీ తెలిపారు. డిస్కౌంట్లను ప్రకటించిన విభాగాల్లో అత్యధికం కేంద్రానికి లేదా ప్రభుత్వసంస్థలకు చెందినవేనన్నారు. రెండు వేలలోపు కార్డు చెల్లింపులపై సేవాపన్నును తొలగించిన అంశాన్ని ప్రస్తావిస్తూ డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే మొత్తం లావాదేవీల్లో 70 శాతం 2 వేల లోపువేనన్నారు. మొత్తానికి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
చచ్చిపోదామన్న ఆలోచనను చంపేస్తారు
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
నయీం రెండు కోరికలు తీరకుండానే...
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
చంద్రబాబుకు చుక్కలే.. సుప్రీంకోర్టు ఆదేశం
రాజీనామాలు అప్పుడే
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాబు గారి అతి తెలివి
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనా?
జియో భారీ ఆఫర్ తెలుసా?
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
అందుకే భూకంపం రాలేదట
251రూపాయల ఫోన్ ఇక రానట్లే
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments