పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు

GHMC and Telangana govt particality in demolitions at hyderabad

హైదరాబాద్ లో ఏం జరుగుతోంది..? అని పెద్దోడిని అడిగితే అక్రమంగా నిర్మించిన పేదోళ్ల ఇళ్లు కూలుస్తున్నారని అంటున్నాడు. అదే ప్రశ్నను పేదోళ్లను అడిగితే మాత్రం పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలను కూల్చడం లేదు అని అంటున్నారు. ఈ రెండు వ్యాఖ్యలో కొంచెం తేడా ఉన్నా కానీ తెలంగాణ సర్కార్ చేస్తున్న నిర్వాకం మాత్రం ఒక్కటే. అదే బలిసినోడికి ఒక న్యాయం, బలహీనుడికి ఓ న్యాయం చేస్తున్నారు అని టాక్. తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

మూడు రోజుల్లో 492 నిర్మాణాలను అధికారులు తొలగించారు. అయితే కొందరు పెద్దలు నాలాలు, చెరువులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా వాటి జోలికి పోవడం విమర్శలకు తావిస్తోంది. GHMC తీరుపై సామాన్యులు ఫైరవుతున్నారు. భాగ్యనగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలన్నిటినీ జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. మొదటి రెండ్రోజులు 250కిపైగా అక్రమ నిర్మాణాలను తొలగించగా.. మూడో రోజు అంతే స్థాయిలో కూల్చివేతలు సాగాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ప్రజాప్రతినిధులు సూచించిన నిర్మాణాలను మాత్రమే తొలగించాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఆమేరకు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.  కుత్బుల్లాపూర్ లో నాలాల ఎంక్రోచ్ మెంట్ వేగంగా జరుగుతోంది. జగద్గిరిగుట్ట, మగ్దూంనగర్‌తో పాటూ గాజులరామారంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. మేయర్‌ రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి ఇద్దరూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మూడో రోజు బడాబాబుల ఇళ్లను తొలగించే పని మొదలు పెట్టిన బల్దియా సిబ్బందికి కొన్నిచోట్ల అడ్డంకులు ఎదురయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లు, రెవెన్యూ అధికారుల స్వయంకృతాపరాధాలతో కూల్చివేతలు నత్తనడకన సాగాయి. జీహెచ్ఎంసీ రికార్డుల్లో బంజారాహిల్స్ రోడ్ నెం 14 లో వున్న బంజారా లేక్ నాలా దగ్గర 15 అక్రమ  భవనాలను గుర్తించారు రెవెన్యూ అధికారులు. రోడ్ నెంబర్ వన్ ప్రధాన రహదారిని ఆనుకుని వున్న  నాలాను కబ్జా  చేసి కడుతున్న ఆరంతస్తుల భవనాన్ని గుర్తించి రెడ్ మార్కింగ్ కూడా వేశారు. కూల్చేందుకు జేసీబీలను కూడా తెప్పించారు. తర్వాత ఏం జరిగిందోగానీ.. రెండు గంటల హైడ్రామా తర్వాత భవనాన్ని కూల్చకుండానే వెనుదిరిగారు అధికారులు.

జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై సామాన్యులు మండిపడుతున్నారు. కాప్రా సర్కిల్‌లో అక్రమ  నిర్మాణాలు కూల్చివేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఉప్పల్ ఎంఎల్ఏ  ఆధ్వర్యంలో కూల్చివేతలను అడ్డుకున్న బస్తీవాసులు.. పెద్దవాళ్ల భవనాలను వదిలేసి.. పేదల ఇళ్ళ  ను  ఎలా కూలుస్తారని నిలదీశారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించడంతోపాటూ తమకు కూడా ఇళ్లు కట్టివ్వాలని వేడుకున్నారు. అయితే అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నాలాల విస్తరణ వల్ల వరద, ఇళ్లలోకి నీళ్లు రావడం తగ్గుతుందంటున్నారు. ఎవ్వరినీ ఉపేక్షించబోమని చెబుతున్నారు మేయర్‌. అయినా అయ్యవార్లు ఎక్కడ తగ్గుతారో.. ఎక్కడ తలదించుకుంటారో అందరికి తెలుసు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts:
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ఏపిలో జగన్ Vs పవన్
పవన్ పోరాటం రాజకీయమే... చిత్తశుద్దిలేని పవన్
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
దేశంలో నోట్ల రద్దు... బాబుగారి ఐడియానే!
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
నల్లధనం ఎఫెక్ట్‌తో మోదీ పదవి ఊడుతుందా?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ఓటుకు నోటు కేసును మూసేశారా?

Comments

comments