హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ

GHMC officials started Demolition illegal constructions

హైదరాబాద్‌లో గత పది రోజలుగా కురుస్తున్న వర్షాలకు పరిస్థితి దారుణంగా మారింది. హైదరాబాద్ నిండా చెరువుల్లా కాలనీలు కనిపిస్తున్నాయి. కాగా హైదరాబాద్ దుస్థితి మీద సమీక్ష జరిపిన సిఎం కేసీఆర్ అక్రమ నిర్మాణాల కూల్చివేత తప్పదు అని తేల్చి చెప్పేశారు. అయితే అనుకున్న వెంటనే జిహెచ్ఎంపీ కార్యాచరణను ప్రారంభించింది. న‌గరంలో ప‌లు ప్రాంతాల్లో ఆక్ర‌మ‌ణ‌కు గురైన నాల‌ల‌ను కూల్చి వేయ‌డం మొద‌లు పెట్టారు. శేరిలింగంప‌ల్లి, మ‌దీనాగూడ‌, గ‌చ్చిబౌలి నుంచి కొత్త‌గూడ వ‌ర‌కూ ఉన్న నాలాల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొలగిస్తున్నారు. ఇలా జంట‌న‌గ‌రాల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన వాటిన్నింటిని కూల్చి వేసే వ‌ర‌కూ ప‌నులు ఆప‌వ‌ద్ద‌ని అధికారుల‌కు సూచించారు

భవిష్యత్తులో అక్రమ కట్టడాలు అనేవి లేకుండా ఎలా చేయాలన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది జిహెచ్ఎంసీ. ఒక ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించే పనిలో జీహెచ్‌ఎంసీ నిమగ్నమై ఉంది. ఒకేసారి 24 సర్కిళ్ళలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తే అందరికి పునరావాసం కల్పించడం కష్టం కనుక దశల వారీగా నాళాలపై ఉన్న వాటిని తొలగించి అందులో ఉన్న వారికి పునరావాసం కల్పిస్తామని, రెండో దశలో మిగతా కట్టడాలను పడగొడతామని అధికారులు చెబుతున్నారు. మరోపక్క  అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబం ధించి న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. ఇప్పటికే ఆయా న్యాయస్థానాల్లో ఉన్న 150 కేసులను త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
పెట్రోల్ లీటర్‌కు 250
అతడికి గూగుల్ అంటే కోపం
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
‘స్టే’ కావాలి..?
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
వాళ్లను వదిలేదిలేదు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
ఆ సిఎంను చూడు బాబు...
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments