అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక

Girls under debt in Telugu States

అప్పు చేసిన వాళ్లు తమ అప్పులను తీర్చలేని పరిస్థితిలో ఇంట్లో ఉన్న ఆడపిల్లలను అప్పిచ్చిన వారికో లేదంటే వారి బంధువులకో ఇచ్చిపెళ్లి చేస్తున్నారు. తాజాగా యునిసెఫ్ నివేదికలో వెల్లడైన నిజాలు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ రకమైన పెళ్లిళ్లు జరుగుతున్నాయి. మేం అంటే మేం గొప్ప అని గొప్పలకుపోయే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందు దీనిపై దృష్టిసారించాలి. ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అప్పుల కారణంగా బాల్యవివాహాలు కూడా పెరిగినట్లు యునిసెఫ్ లెక్కలుకట్టింది.

అవసరానికి అప్పు తీసుకోవడం.. అప్పు తీర్చలేక నానా కష్టాలుపడటం సగటు వ్యవసాయ కూలీల కుటుంబంలో జరుగుతున్న తంతు. అప్పులు తీర్చలేని చాలా మంది కుటుంబ సభ్యులు తమ ఇంట్లో చిన్న వయస్సులో ఉన్నా ఆడపిల్లను అప్పిచ్చిన వారికి, లేదా వారి సమీప బంధువులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. భారత్ లాంటి దేశాల్లో 18 ఏళ్లు నిండితే కానీ పెళ్లి చెయ్యడానికి వీలులేదు. కానీ అలాంటి రూల్స్ ఎవరూ పాటించడం లేదని తేలింది.  చిన్నారుల భవితను తల్లిదండ్రులే చిదిమేస్తున్నారంటూ ఐక్యరాజ్యసమితికి చెందిన యునిసెఫ్ చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏటా జరిగే మొత్తం వివాహాల్లో బాల్యవివాహాలు 51.8 శాతం పైనే ఉంటున్నట్టు ఆ నివేదికలో పేర్కొంది. ఈ బాల్యవివాహాలకు ఒకప్పుడు నిరక్షరాస్యత ప్రధాన కారణం కాగా, ఇప్పుడు సామాజిక, ఆర్థిక, కుటుంబ కారణాలగా తేలాయని నివేదికలో వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 ఏళ్లలోపు వయసుగల బాలికల వివాహాలు అధికంగా జరుగుతున్నట్టు నివేదికలో వెల్లడించింది. యునిసెఫ్ నివేదిక ప్రకారం పలు సందర్భాల్లో తల్లిదండ్రుల తాము తీసుకున్న అప్పు తీర్చలేకపోయిన లేదా కొత్తగా రుణం తీసుకోవాలన్నా తమ చిన్నారులను అప్పు ఇచ్చే వ్యక్తికో లేదా వారి సమీప బంధువులకో ఇచ్చి కట్టబెట్టేస్తున్నారు. ఈ తరహా వివాహాలు ఎక్కువగా కూలి పని చేసుకునే వారు చేస్తున్నట్టుగా వివరించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. తెలంగాణలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా 61 శాతం, హైదరాబాద్‌లో కనిష్ఠంగా 21 శాతం జరుగుతున్నాయి. పురుషులు, మహిళలు ఉన్నత చదువులు చదవడం, ఆడపిల్లలు ఎక్కువగా పాఠశాలలకు వెళ్లడం, సంపద ఏ కొందరి చేతిలోనో కాకుండా అందరి వద్ద ఎంతో కొంత ఉన్న రాష్ట్రాల్లో బాల్యవివాహాలు తక్కువగా జరుగుతున్నాయని వివరించింది. అయితే ఈ విధంగా జరగడానికి ఆచార వ్యవహారాలే కారణమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలకు మేనమామలతో వివాహం జరిపించే ఆచారం ఉండడం వల్ల వధూవరుల మధ్య వయసులో తేడా ఎక్కువగా ఉంటోందని యునిసెఫ్ తన నివేదికలో పేర్కొంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నివేదిక ఆధారంగా అయితే ఇలాంటి ఘటనలకు అవకాశం కల్పించకుండా చర్యలకు దిగాలి.

Related posts:
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
అతడికి గూగుల్ అంటే కోపం
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
గాల్లో తేలినట్టుందే.. పెళ్లి చేసినట్టుందే
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
అతడి హనీమూన్ కు సుష్మా స్వరాజ్ సహాయం
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
మంత్రుల ఫోన్లు బంద్
పవన్ కు తిక్కుంది.. కానీ లెక్కేది?
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
మోదీ చేసిందంతా తూచ్..
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
BSNL లాభం ఎంతో తెలుసా?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?

Comments

comments