బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Gold rate smash with Modi's Demonetisation effect

మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత నోట్ల విషయంలో అందరూ కాస్త సంకోచించారు. కానీ బంగారం మీద మాత్రం మక్కువపెంచుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం మీద కొన్ని షరుతులు విధిస్తుండటంతో బంగారం డిమాండ్ తగ్గుతోంది. దాంతో బంగారం రేటు పడిపోతుంది. వరసగా రెండో రోజు ధరలు తగ్గాయి. ఆరు నెలల కనిష్ట స్థాయికి ధర పడిపోయింది. వ్యాపారాల నుంచి డిమాండ్ పడిపోవటంతో.. బంగారం ధర గురువారం ఒక్కరోజే 300 రూపాయల మేర పతనమైంది. స్టాక్ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు 244 రూపాయల నష్టంతో 28వేల 141రూపాయలుగా నమోదైంది. వెండి సైతం 735రూపాయల నష్టంతో కేజీ ధర 40వేల 700 రూపాయలుగా నమోదైంది.

కాగా బంగారం అంటేనే మన వాళ్లకు చాలా సెంటిమెంట్. ప్రపంచంలో బంగారాన్ని వాడుతున్న దేశాల్లో భారతదేశం టాప్ లో ఉంటుంది. అలాంటి బంగారం వాడకంలో మన ఆడవాళ్లు అందరికన్నా ముందుంటారు. అయితే మోదీ నిర్ణయాల వల్ల బంగారం కొనుగోలు చెయ్యాలన్నా, బంగారాన్ని దాచుకోవాలన్నా కూడా పరిస్థితులు బాగోలేవు. అయితే తాజాగా మార్కెట్ మీద బంగారం ధరలు గట్టిగా ప్రభవాన్ని చూపుతున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనంతరం బంగారం కొనుగోళ్లపై పరిమితులు విధిస్తుండటంతో బంగారం డిమాండ్ పడిపోయిందని వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

Related posts:
ఇది గూగుల్ సినిమా(వీడియో)
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
హనీమూన్ కు భర్తలేకుండా వెళ్లిన భార్య
సైన్యం చేతికి టర్కీ
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
అతడు బ్రతికినప్పుడు బిచ్చగాడు.. చచ్చాక కోటీశ్వరుడు
నయీం రెండు కోరికలు తీరకుండానే...
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
స్టే ఎలా వచ్చిందంటే..
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
BSNL లాభం ఎంతో తెలుసా?
అతి పెద్ద కుంభకోణం ఇదే
మోదీ మీద మర్డర్ కేసు!
బస్సుల కోసం బుస్..బుస్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
బీసీసీఐకి సుప్రీం షాక్

Comments

comments