కొత్త నోట్లు దొరికితే ఏం చేస్తారో తెలుసా?

New currency notes

నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హ‌రం భార‌త్ దేశాన్ని కుదిపేస్తోంది. నెల‌రోజులు దాటినా…నోట్ల మార్పిడి క‌ష్టాలు మాత్రం సామాన్యుడిని వీడ‌లేదు. ఇలాంటి టైమ్‌లో కొంత‌మంది పెద్ద మ‌నుషుల ద‌గ్గ‌ర కొత్త నోట్లు విచ్చ‌ల‌విడిగా క‌నిపించ‌డం అంద‌రిని కంగారులో ప‌డేశాయి. అంతేకాదు…త‌మ‌కు చూద్దామ‌న్న దొర‌క‌ని నోటు వాళ్ల‌కి మాత్రం క‌ట్ట‌లు క‌ట్ట‌లు దొర‌క‌డంపై ప్ర‌జ‌లు నిర‌స‌న గ‌ళం విప్పారు. ఇలాంటి టైమ్‌లో టీటీడీ మాజీ స‌భ్యుడు శేఖ‌ర్ రెడ్డి ద‌గ్గ‌ర 125కోట్ల‌కి పైగా కొత్త నోట్లు దొర‌క‌డం పెద్ద సంచ‌ల‌నాన్నే రేపింది.

ఇలా ఐటీ శాఖ‌కు ప‌ట్టుబ‌డుతున్న కొత్త నోట్ల‌ను వాళ్లు ఏం చేస్తార‌నేది హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కుముందు లాగా ప‌ట్టుకున్న నోట్ల‌ను స్ట్రాంగ్ రూమ్‌లో పెట్ట‌కుండా, మ‌ళ్లీ తిరిగి బ్యాంక్‌ల‌కే పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ డ‌బ్బులు సామాన్యుడికి ఎంతో అవ‌స‌ర‌మ‌ని, అలాంటి టైమ్‌లో ఎవ‌రో కొంద‌రు చేసిన త‌ప్పుకు అంద‌రిని శిక్షించ‌డం స‌రికాద‌ని వారు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు..ఎక్క‌డ కొత్త నోటు దొరికిన భ‌ద్రంగా..దానికి బ్యాంక్‌కు చేర్చుతామ‌ని చెబుతున్నారు.

గ‌తంలో…ఇలా డ‌బ్బును స్వాధీనం చేసుకున్న వెంట‌నే, వాటిని స్ట్రాంగ్ రూమ్‌ల‌లో భ‌ద్ర‌ప‌రిచేవారు. వీటినే, సాక్ష్యాలుగా చూపి స‌ద‌రు వ్య‌క్తుల‌పై కేసులు న‌మోదు చేసేవారు. అయితే, ఇప్పుడు దేశంలో ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉండ‌టంతో వాటిని సాక్ష్యంగా చూపిస్తూనే, తిరిగి బ్యాంక్‌ల్లో జ‌మ‌చేసేలా కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే ముద్ర‌ణ విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కేంద్రం, ఇలా చేయ‌కపోతే మ‌రింత ఇబ్బందుల్లో ప‌డుతుంద‌ని భావించ‌డంతోనే వాటిని మ‌ళ్లీ బ్యాంక్‌ల‌కు చేర‌వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Related posts:
పది వేలలోపే ఎల్ఈడీ టీవీ
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
కటకటాల్లో కోడి.. ఖమ్మంలో వింత
చిలిపి.. చేష్టలు చూస్తే షాక్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
జగన్ అన్న.. సొంత అన్న
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
సన్మానం చేయించుకున్న వెంకయ్య
రాజీనామాలు అప్పుడే
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
ఆ 400 మంది సాక్షిగా పవన్ ప్రమాణం
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
గుదిబండగా మారిన కోదండరాం
ఎప్పటికీ అది శశి‘కలే’నా?

Comments

comments