హైదరాబాద్ లో ఇక నీళ్లే నీళ్లు.. ఇంకుడు గుంత ప్రభావం

Ground water leve Increased in Greater Hyderabad

ప్రతి పనికి ఓ ప్రతిచర్య ఉంటుంది అన్నది వాస్తవం. అలాగే మనం చేసే మంచి పనులు మంచి ఫలితాలను ఇస్తోంది అనడానికి హైదరాబాద్ లో ఇంకుడు గుంతలే సాక్షాలు. భూగర్భ జలాల కొరతను ఎదుర్కోవడానికి హైదరామబాద్ గ్రేటర్ పరిధిలో ఇంకుడు గుంతలు తవ్వించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు తీశారు. చాలా కాలనీల్లో సొసైటీలు తమ ఏరియాలో భూగర్భ నీటి వనరుల పెంపుదల కోసం ఇంకుడు గుంతలు తవ్వించడానికి ముందుకు వచ్చాయి. కాగా ఇప్పుడు ఆ ఇంకుడు గుంతల ఫలితాలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం చెరువుల్లో పూడిక తీయడమే కాకుండా ఇంకుడు గుంతలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. నగరంలో చాలా చోట్ల ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించింది. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులన్నీ నిండాయి. ఇంకుడు గుంతలు వాన నీటిని ఒడిసి పట్టాయి. ఫలితంగా గ్రౌండ్ వాటర్ లెవల్ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే సిటీలో నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు పైకి వచ్చాయి. గత ఏడాది సెప్టెంబర్ తో చూస్తే 4 మీటర్లు, మొన్న ఆగస్టు తో పోలిస్తే 5 మీటర్లు, మే నెలతో కంపేర్ చేస్తే 6 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ పెరిగింది.

హైదరాబాద్ నగరంలోని మారేడ్‌ పల్లి లాంటి ప్రాంతాల్లో 10 మీటర్ల పైనే నీటి మట్టం పెరగడం విశేషం. అమీర్‌ పేట్‌ లో 4.95 మీటర్లు, ఆసిఫ్‌ నగర్‌ 2.75, బండ్లగూడ 2.25, చార్మినార్ 5.82, ఖైరతాబాద్‌ 6.38, నాంపల్లిలో 3.60 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. ఇకపోతే షేక్ పేట్‌ లో 2.05 మీటర్లు, సైదాబాద్‌ 2.20, బహదూర్‌ పూర్‌ 1.46, హిమాయత్‌ నగర్‌ 4.19, ముషీరాబాద్‌ 4.95, కుత్బుల్లాపూర్‌ 1.10, శంషాబాద్‌ 0.90, రాజేంద్రనగర్‌ లో 2.70 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ లెవల్ పెరిగిందని జలవనరుల శాఖ జేడీ ధనంజయ్‌ వివరాలను తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని 16 ప్రాంతాల్లో భూగర్భ జల వనరుల శాఖ అధికారులు వాటర్ లెవల్ మెజర్ మెంట్ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా నగరంలో భూగర్భ జలాలు పెరిగినట్టు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలు కూడా భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడ్డాయి. ఏది ఏమైనా నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుంటూ.. విధిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో నీటి కొరత ఉండదు అన్నది మాత్రం వాస్తవం.

Related posts:
ఇండియా, పాక్ మధ్యలో తెలంగాణ కేసు
మోదీ టాస్ గెలుస్తాడా..? లేదా.?
తెలుగు రాష్ట్రాల మధ్య హైకోర్టు ఫైట్..టిఆర్ఎస్ కు ఐదు లాభాలు
ఉగ్రవాదిలో చూడాల్సింది.. మతమా..? మారణహోమమా..?
కాశ్మీర్ కోసం ఇండియా, పాక్ ఆరాటం వెనక చరిత్ర ఇది
ఉప్పెనలా జగన్ డిజిటల్ సేన
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
పివి సింధు విజయం.. వెనక రాజకీయం
ముద్రగడకు నాడు పవన్ అందుకే దూరం
పవన్ మాస్టర్ స్కెచ్
ఆ అరుపులేంటి..?
పట్టిసీమ వరమా..? వృధానా..?
ప్రత్యేక హోదా లాభాలు
అప్పుడు రాముడు.. ఇప్పుడు చంద్రుడు
మింగడంలో శభాష్ అనిపించుకున్నారు
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
కేజ్రీవాల్, రాహుల్ లు చేసేది రాజకీయాలేనా?
పందికొక్కుల కోసం ఇళ్లు తగలెడతామా?
మోదీ భజన అందుకేనా?
మోదీ మంచి చేస్తే భయం ఎందుకు?
జయలలిత జీవిత విశేషాలు
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments