ఛాయ్‌వాలా@400కోట్లు

Gujarat Chaiwala with four hundred crore rupees

ఛాయ్ వాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు ముంబై డబ్బావాలాలు ఎంత ఫేమసో… ఇప్పుడు దేశం మొత్తం ఛాయ్ వాలాలు బాగా ఫేమస్. ఒకప్పుడు ఛాయ్ వాలాగా పనిచేసిన నరేంద్ర మోదీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ.. ఇప్పుడు దేశ ప్రధానిగా ఎదిగారు. అలాగే ఒకప్పుడు ఛాయ్ అమ్ముకునే పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఛాయ్ వాలా ఇలాంటి వార్తల కోవలో కాకుండా సంచలనం రేపే రేంజ్ లో వార్తల్లో నిలిచాడు. ఇంతకీ ఆ ఛాయ్ వాలా ఎవరు? ఏం చేశారు? అనేగా మీ సందేహం అయితే మొత్తం ఆర్టికల్ చదవండి మీకే తెలుస్తుంది.

ముప్పై సంవత్సరాల క్రితం సౌరాష్ర్ట నుంచి సూర‌త్ వ‌చ్చాడు. బ్యాంకులో అప్పు తీసుకొని టీ దుకాణం ప్రారంభించాడు. ఆ త‌ర్వాత బ‌జ్జీలు అమ్మ‌డం ప్రారంభించాడు. దాంతో అయ‌న భ‌జియావాలా అయిపోయాడు. ఆయ‌న వ్యాపారం పెరిగింది. డ‌బ్బు స‌మ‌కూరింది. వ‌డ్డీ వ్యాపారం ప్రారంభించాడు. చాయ్‌వాలా ఫైనాన్షియ‌ర్ అయ్యాడు. రుణ‌గ్ర‌స్తులు డ‌బ్బు తిరిగి ఇవ్వ‌లేక‌పోతే అస్తులు స్వాధీనం చేసుకున్నాడు. వంద‌ల‌కోట్లు కూడ‌బెట్టాడు. మోదీ పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టించాడు. సూర‌త్ జిల్లా స‌హ‌కార బ్యాంక్ ఉధానా బ్రాంచ్‌కు పెద్దనోట్లు సంచుల కొద్దీ చేరిపోయాయి. ఈ నేప‌థ్యంలో అందిన ప‌క్కా స‌మ‌చారంతో కిశోర్ భ‌జియావాలా ఇంట్లో, అత‌ని బంధువుల ఇళ్ల‌లో ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. 400 కోట్ల ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించారు. కోటీ 33ల‌క్ష‌ల న‌గ‌దు, ఏడు కోట్ల విలువైన బంగారం, 72 ల‌క్ష‌ల విలువైన వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి మోదీ దెబ్బతో ఏకంగా 400 కోట్ల ఛాయ్ వాలా వెలుగులోకి వచ్చాడు.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
పెట్రోల్ లీటర్‌కు 250
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?
ఆట ఆడలేమా..?
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
జగన్ సభలో బాబు సినిమా
దిగజారుతున్న చంద్రబాబు పాలన
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
అమ్మ పరిస్థితి ఏంటి?
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments