గుజరాత్ సిఎం రాజీనామా

Gujarat CM Anandi Ben Patel Resigs

నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ ప‌టేల్ రాజీనామా చేశారు. గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితుల ఆందోళ‌న‌లు చ‌ల్లార‌క పోవ‌డంతో ఆమె వైదొల‌గ‌క త‌ప్ప‌లేదు. అయితే ఆమె రాజీనామా లేఖ‌ను గవర్నర్ కు కాకుండా ప్రస్తుతానికి బీజేపీ అధిష్టానానికి పంపించి.. వెంట‌నే ఆమోదించాల్సిందిగా కోరారు. ఈ లేఖ‌ను త‌న ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.నిజానికి రెండు నెల‌ల క్రిత‌మే త‌ను రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకుని ఇదే విష‌యం పార్టీ అధినాయ‌కత్వానికి తెలియ‌ప‌రిచాన‌ని… త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వైబ్రెంట్ స‌ద‌స్సుకు కొత్త నాయ‌కుడిని ఎంపిక చేయ‌డానికి అధిష్టానానికి స‌మ‌యం ఉంటుంద‌ని కూడా చెప్పాన‌ని ఆమె త‌న పోస్టులో వెల్ల‌డించారు.

గోసంర‌క్ష‌క స‌మితికి చెందిన వారు న‌లుగురు యువ‌కుల‌ను రోడ్డుపై విచ‌క్ష‌ణార‌హితంగా కొట్ట‌డం పెద్ద వివాదానికి దారితీసింది. ఆవుల చ‌ర్మం వ‌లిచి అమ్ముతున్నార‌న్న‌ది వారిపై  ఆరోప‌ణ‌. దీనిపై ద‌ళితులు ఎదురు తిరిగారు. ఇక‌పై చ‌నిపోయిన గోవుల‌ను కూడా తొల‌గించడానికి తాము వెళ్ల‌బోమ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాక జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై వేల‌మంది ద‌ళితులు రోడ్డెక్కారు. ప‌రిస్థితి త‌న చేయి దాటింద‌ని గ‌మ‌నించిన ఆనందిప‌టేల్ రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారు. గతంలో పటేల్ ఉద్యమం సమయంలో కూడా ఆనందిబెన్ పాటిల్ తీవ్ర వత్తిడికి గురయ్యారు. దాంతో తాను ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగాలని అనుకుంటున్నానని.. లేఖ రాశారు. పైగా 75ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చింద‌ని పార్టీ నియమావ‌ళి ప్ర‌కారం.. ఆవ‌య‌స్సు ఉన్న‌వాళ్లు ప‌ద‌వుల్లో ఉండ‌రాద‌ని ఆమె సూచించారు. . బెన్ రాజీనామాపై పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు.

Related posts:
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
గూగుల్ పై ‘క్రిమినల్’కేసు కారణం మోదీ
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
కో.. అంటే కోటి అనేలా నయీం లైఫ్
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
జియో దిమ్మతిరిగే ఆఫర్లు ఇవే..
పాక్ దిమ్మతిరిగింది.. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే చేసేది అదే
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
పిహెచ్‌డి పై అబద్ధాలు
చెరువుల్లో ఇక చేపలే చేపలు
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
బతుకు బస్టాండ్ అంటే ఇదే
మోదీ హీరో కాదా?
బినామీలు భయపడే మోదీ ప్లాన్
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
500 నోటుపై ఫోటో మార్చాలంట
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments