ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?

Hafeez Sayeed comments on Surgical Strike

చింత చచ్చినా పిలుపు చావలేదు అంటే ఇదేమరి. భారత ఆర్మీ పాకిస్థాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్ కు ఇప్పటికే పాక్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ వేసిన పాచిక పాకిస్థాన్ మీద బాగా పనిచేసింది. అయితే అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే  ఏమిటో భారత్‌కు తాము రుచి చూపిస్తామని జమాత్‌ఉద్‌దవా (జేయూడీ) ఉగ్రవాదసంస్థ అధిపతి హఫీజ్‌సయీద్ ప్రగల్భాలు పలికాడు. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఒక బహిరంగసభలో సయీద్ మాట్లాడాడు. ఆజాద్ కశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్)లో భారతసైన్యం జరిపిన దాడులకు దీటుగా స్పందిస్తామని పేర్కొన్నాడు.

‘‘భారత్‌కు తగిన పాఠం నేర్పించటం ఇక పాకిస్థాన్ వంతు. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో నరేంద్రమోదీకి తెలుస్తాయి. లక్షిత దాడులను పాకిస్థానీ జవాన్లు ఎలా జరుపుతారో చూడమని భారత మీడియాకు చెబుతున్నా. మీకు అమెరికా కూడా సాయపడలేదు’’ అని సయీద్ పేర్కొన్నాడు. 2008లో ముంబయిలో పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమానికి ప్రధాన సూత్రధారిగా సయీద్ వ్యవహరించాడు. దీనిపై మన నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. పాకిస్థాన్ ప్యాంటు తడిసినా కానీ పొగరు మాత్రం తగ్గలేదు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related posts:
నింగిలోకి ఎగిరేది రాకెట్.. కాదు మన కీర్తి
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
పోలీసులపై తాగుబోతు పాప ప్రతాపం(వీడియో)
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
జియోకు 9900 కోట్లు కట్టాల్సిందే... ఎయిర్‌టెల్, వోడాఫోన్, ఐడియాలకు షాక్
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
బాబు కుటుంబానికి వార్నింగ్.. ఆత్మాహుతి దాడికి సిద్ధం అంటూ మావోల లేఖ
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
అకౌంట్లలోకి 21వేల కోట్లు
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
గాలిలో విమానం.. అందులో సిఎం
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
దేశభక్తి అంటే ఇదేనా?
డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Comments

comments