ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు

fb-harassments

ప్రపంచంలో ఎక్కడ ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు అనే ప్రశ్నకు ముందుగా వచ్చే సమాధానం ఖచ్చితంగా గూగుల్. కానీ తర్వాత లిస్ట్ లో ఎక్కడో చోట ఫేస్ బుక్ కూడా ఉంటుంది. అక్కడ ఉద్యోగులకు కల్పించే వసతులు అన్ని ఇన్ని కాదు అనే భావన ఉంది. ఆఫీస్ అంటే ఉద్యోగులకు స్వర్గధామం అనే పేరుంది. అలాంటి ఆఫీసుల గురించి తెలుసుకొని చాలా మంది కుళ్లుకుంటారు. తమ ఆఫీసుల్లో అలాంటి ఫెసిలిటీలు లేవని ఏడుస్తుంటారు. కానీ తాజాగా ఫేస్ బుక్ ఆఫీస్ లో బాగోతాలు బయటపడ్డాయి. అన్ని ఆఫీసుల్లో మాదిరిగా అక్కడ కూడా వేధింపులు ఉన్నాయని తెలిసింది.

ఫేస్ బుక్ లో కూడా వేధింపులే కాకుండా లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని అక్కడి ఉద్యోగులు వెల్లడించినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలిసినా కానీ ఎవరు ఏమీ చెయ్యడంలేదని అక్కడి ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. అలాగే అక్కడి హెఆర్ డిపార్ట్ మెంట్ కు చెందిన వాళ్లు కాస్త మహిళల పట్ల అతిగా ప్రవర్తిస్తున్నారని దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కూడా తెలిసింది. పైగా అక్కడ అందమైన అమ్మాయిలను కొన్ని పరిధులు ఉంచినట్లు తెలిసింది. అమ్మాయిలు మరీ అందంగా తయారై, కొత్త కొత్త డ్రెస్ లు వేసుకురావడానికి వీలులేదని.. అలా చెయ్యడం వల్ల పక్క ఉద్యోగులు డిస్ట్రబ్ అవుతారని కంపెనీలో రూల్ తీసుకువచ్చినట్లు తెలిసింది.

అలాగే ఫేస్ బుక్ సిఈఓ మార్గ్ జుకెన్ బర్గ్ కూడా చాలా వేధిస్తారని తెలిసింది. ఓ ప్రాజెక్టు విషయంలో ఓ ఉద్యోగి మీడియా ముందు కొన్ని విషయాలను చెప్పడంతో వెంటనే ఆఫీస్ లో అందరి మీద అరిచేశాడని తెలిసింది. వెంటనే అందరికి మెయిల్స్ పెట్టాడని.. అందులో ప్లీజ్ రిజైన్ (దయచేసి రాజీనామా చెయ్యండి) అని రాసినట్లు తెలిసింది. మీరు అందరూ కంపెనీకి వెన్నుపోటుపొడిచారని… కాబట్టి కంపెనీ నుండి తప్పుకోవాలని మెయిల్ చేశాడట. పైగా కోపం వస్తే జుకెన్ బర్గ్ ఇష్టానుసారం అరుస్తారని కూడా తెలిసింది. మొత్తానికి మామూలు ఆఫీసుల్లో ఉండేలాగా కోపాలు, తాపాలు, వేధింపులు ఫేస్ బుక్ ఆఫీస్ లో కూడా ఉంటాయని తేలింది. మొత్తానికి దూరపు కొండలు నున్న అన్నట్లు అనుకున్న వారికి ఇది ఖచ్చితంగా కనువిప్పు కలిగిస్తుంది.

Related posts:
గోమూత్రంలో బంగారు.. నిజంగా నిజం
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
తాగుబోతుల తెలంగాణ!
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
రక్తంతో ముఖ్యమంత్రికి లేఖ రాసిన చిన్నారి
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఆటలా..? యుద్ధమా..?
‘స్టే’ కావాలి..?
జియోకే షాకిచ్చే ఆఫర్లు
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
జగన్ సభలో బాబు సినిమా
వాడు మా పార్టీవాడు కాదు: కేటీఆర్
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
AP 70% జనాభా పల్లెల్లోనే..!

Comments

comments