గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు

Harish Dhandev earning two crore per anum after Resigning his Govt Job

దమ్మున్నోడు ఎక్కడికి వెళ్లినా దుమ్మురేగ్గొడతాడు అన్నది వాస్తవం. తాజాగా ఇలాంటి దమ్మున్నోడి గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆ పోస్ట్, ఆ వ్యక్తి గురించి తెలిసిన వాళ్లంతా కూడా వీడు మగాడ్రా బుజ్జి అంటూ కామెంట్ చేస్తున్నారు అంటే మనోడు ఎంట గ్రేటో అర్థమవుతుంది. మనోడు ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. తాను సంపాదిస్తున్న దానితో ఏమాత్రం సంతృప్తి చెందన హరీశ్ ధండేవ్ అనే వ్యక్తి సాధించిన విజయాన్ని సోషల్ మీడయా విపరీతంగా పాపులర్ చేసింది. మరి అంతలా పాపులర్ కావడానికి మనోడు ఏం సాధించాడో తెలుసా..

రాజస్థాన్.. అంటేనే ఓ ఎడారి. అలాంటి ఎడారి ప్రాంతానికి చెందిన హరీశ్ ధండేవ్ అనే వ్యక్తి వృత్తిరిత్యా ఓ గవర్నమెంట్ ఉద్యోగి. కానీ మనోడికి జీతం మాత్రం సంతృప్తినివ్వలేదు. దాంతో ఏకంగా ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తనకున్న 120 ఎకరాల్లో వ్యవసాయాన్నిమొదలుపెట్టాడు. 120 ఎకరాలు ఉన్నాయ అంటే ఎక్కడికో ఆలోచంచకండి.. కేవలం అవి ఎడారి భూములు. మాములుగా సాగుచెయ్యడాని వీలయ్యేవికావు. కానీ హరీశ్ మాత్రం వాటి ద్వారానే ఇప్పుడు ఏడాదికి కోటిన్నర నుండి రెండు కోట్లు సంపాదిస్తున్నాడు. ఎలా అనుకుంటున్నారా..? అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్‌ ఉన్న మొక్క కలబంద. ఆయుర్వేదంతోపాటు ఎన్నో రకాల ఔషధాల్లో కలబందను ఉపయోగిస్తున్నారు. అవి ఇసుక నేలల్లోనే ఎక్కువగా పండుతాయి. అందుకే తన 120 ఎకరాల్లోనూ కలబందనే వేశాడు హరీశ్‌. ఇతనితో పతంజలి ఫుడ్‌ ప్రొడక్జ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీకి అవసరమైన కలబందను హరీశ్‌ సప్లై చేస్తాడు. ఇలా తన గవర్నమెంట్ జాబ్ ను వదిలేసి.. కోట్లు సంపాదించి హీరోగా నిలిచాడు.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆ బట్టతలకు భయపడుతున్న దేశ ప్రజలు
బాబోయ్ బాబు వదల్లేదట
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
సౌదీలో యువరాజుకు ఉరి
2018లో తెలుగుదేశం ఖాళీ!
అమెరికా ఏమంటోంది?
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
కొత్త క్యాంపు కార్యాలయంలోకి కేసీఆర్
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
మోదీ హత్యకు కుట్ర... భగ్నం
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
బాబుకు గడ్డి పెడదాం
యాహూ... మీ ఇంటికే డబ్బులు
నరేంద్ర మోదీ తెచ్చిన భీం యాప్ గురించి తెలుసా?
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
ఏపికి యనమల షాకు

Comments

comments